Harish Rao: రైతు రుణమాఫీపై బ్యాంకర్లతో హరీశ్‌రావు సమీక్ష

ABN , First Publish Date - 2023-09-04T17:33:49+05:30 IST

ప్రతి ఒక్కరికీ రుణమాఫీ అందేలా చూడాలని బ్యాంకర్లకు మంత్రి అదేశించారు. వ్యవసాయ శాఖ తరపున గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లుగా, రుణమాఫీ పొందే రైతులు.. సమస్యలు చెప్పుకునేలా ఆయా బ్యాంకులు కూడా టోల్ ఫ్రీ ఏర్పాటు చేయాలని బ్యాంకర్లకు మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

Harish Rao: రైతు రుణమాఫీపై బ్యాంకర్లతో హరీశ్‌రావు సమీక్ష

హైదరాబాద్: రైతు రుణమాఫీపై మంత్రి హరీశ్‌రావు (Harish Rao) సమీక్ష నిర్వహించారు. డా.బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో బ్యాంకర్లతో మంత్రి హరీష్ రావు సమావేశం అయ్యారు. ఈ భేటీలో సీఎస్ శాంతికుమారి, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే లక్ష రూపాయలలోపు రుణాలు మాఫీ అయ్యాయి. సాంకేతిక, ఇతర కారణాలతో కొందరికి రుణమాఫీ కానీ అంశంపై చర్చించారు. ప్రతి ఒక్కరికీ రుణమాఫీ అందేలా చూడాలని బ్యాంకర్లకు మంత్రి అదేశించారు. వ్యవసాయ శాఖ తరపున గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లుగా, రుణమాఫీ పొందే రైతులు.. సమస్యలు చెప్పుకునేలా ఆయా బ్యాంకులు కూడా టోల్ ఫ్రీ ఏర్పాటు చేయాలని బ్యాంకర్లకు మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

Updated Date - 2023-09-04T17:39:26+05:30 IST