Narayana: ఇంకా తెలంగాణ పసి బిడ్డగానే ఉంది...

ABN , First Publish Date - 2023-06-02T13:18:35+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ పదో సంవత్సరంలో అడుగుపెడుతోందని, ఇంకా తెలంగాణ పసి బిడ్డగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

Narayana: ఇంకా తెలంగాణ పసి బిడ్డగానే ఉంది...

హైదరాబాద్: తెలంగాణ (Telangana) పదో సంవత్సరంలో అడుగుపెడుతోందని, ఇంకా తెలంగాణ పసి బిడ్డగానే ఉందని సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అనేక వనరులు ఉన్నాయని.. అన్నీ ఉండి ఇంకా ఎందుకు నిరుద్యోగులు అలమటిస్తున్నారని ప్రశ్నించారు. దీని కోసం తెలంగాణ సాధించుకున్నది కాదని అన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) గోల్కొండలో జాతీయ జెండా (National Flag)ను ఎగురవేశారని, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ కూడా అటు ఇటు అనే ఆట అడాయని నారాయణ విమర్శించారు. సీపీఐ మాత్రమే తెలంగాణకు మద్దతుగా నిలిచిందన్నారు. ప్రస్తుతం సీఎం స్వాముల చుట్టూ తిరుగుతున్నారని, అసలు బీజేపీకి బుద్ది ఉందా? అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రిని కలవగానే శరత్ చంద్ర రెడ్డి అప్రువర్‌గా మారుతారని, కవితకి సాఫ్ట్ అవుతుందని, అవినాష్ రెడ్డికి బెయిల్ వస్తుందని, ఇదంతా క్విడ్ ప్రో కో మాదిరిగా మారిందన్నారు.

మాజి ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ

తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని అనుకున్నారు. కానీ ఇందులో కొంత ముందుకు పోయిన ఇంకా వెనకబడి ఉందని చాడ వెంకటరెడ్డి (Chada Venkata Reddy) అన్నారు. కేంద్ర బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కృష్ణ జలాల వాటా ఇంతవరకు తేల్చలేదని, ఇంకా ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. ధరణి పోర్టల్ పూర్తిగా దరిద్రపు పోర్టల్ అని.. 8 లక్షల మంది రైతులు బజారున పడి తిరుగుతున్నారని అన్నారు. కేసీఆర్ మాన్యువల్ మెయింటైన్ చేస్తాం అన్నారని.. ఇంత వరకు చేయలేదని చాడ వెంకటరెడ్డి అన్నారు.

Updated Date - 2023-06-02T13:18:35+05:30 IST