Share News

T.Highcourt: ఏపీ సీఎం జగన్‌‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

ABN , First Publish Date - 2023-11-08T12:45:30+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది.

T.Highcourt: ఏపీ సీఎం జగన్‌‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి (AP CM YS Jaganmohan Reddy) తెలంగాణ హైకోర్టు (Telangana HighCourt) నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య (Former MP Harirama Jogaiah) వేసిన పిల్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. సీజే జస్టిస్ అలోక్ అరాధే (CJ Justice Alok Aradhe), జస్టిస్ ఎన్‌వి శ్రావణ్ కుమార్ (Justice NV Shravan Kumar) ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిల్‌గా పరిగణించేందుకు రిజిస్ట్రీ (Registry) పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ జరిగింది. పిల్‌లో సవరణలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. జోగయ్య తరపు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ (Advocate Polishetty Radhakrishna) వాదనలతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. హరిరామజోగయ్య పిల్‌కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది. అలాగే ప్రతివాదులు జగన్ (CM Jagan), సీబీఐకి (CBI) హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కోర్టులో (CBI Court) జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని కోర్టుకు జోగయ్య వినతి చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును హరిరామ జోగయ్య కోరారు.

Updated Date - 2023-11-08T13:00:45+05:30 IST