Swapnalok Fire Accident: స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం ఘటనలో 6 మృతదేహాలకు పోస్టుమార్టమ్ పూర్తి
ABN , First Publish Date - 2023-03-17T16:56:28+05:30 IST
Swapnalok Fire Accident: సికింద్రాబాద్(Secunderabad)లోని స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok Complex)లో అగ్నిప్రమాదం ఘటనలో 6 మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్ట్ అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.
Swapnalok Fire Accident: సికింద్రాబాద్(Secunderabad)లోని స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok Complex)లో అగ్నిప్రమాదం ఘటనలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్ట్ అనంతరం మృత దేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ ఘటనతో జంట నగరా లప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది(Fire Officials) అప్రమత్తతో పెనుప్రమాదం నుంచి బయటపడినా..భారీగా ప్రాణనష్టం, ఆస్థినష్టం అపలేకపోయారు. ఈ ప్రమాదంలో పొగకారణంగా అస్వస్థతకు గురైనా పలువురు స్థానికులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కాగా గురువారం రాత్రి సికింద్రాబాద్‌లో స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok Complex)లో జరిగి భారీ అగ్నిప్రమాదం అగ్నిప్రమాదం విషాదాన్ని నింపింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతుల్ని ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్‌గా గుర్తించారు. వీరిలో వరంగల్‌కు చెందిన ముగ్గురు, ఇద్దరు మహబూబాబాద్ వాసులు, ఖమ్మంకు చెందిన ఒకరు ఉన్నారు. రూబీ హోటల్ అగ్నిప్రమాదం (Ruby Hotel Fire Accident) ఘటనను మరువక ముందే.. సికింద్రాబాద్ (Secunderabad)లో మరో భారీ ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ (Swapnalok Complex)లో అగ్ని ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ 7, 8వ అంతస్తుల్లో భారీగా మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్ లోపల చిక్కుకున్న బాధితులు రక్షించాలంటూ కేకలు వేశారు. కాంప్లెక్స్‌లో చిక్కుకున్న వాళ్లను కాపాడేందుకు నాలుగు ఫైరింజన్లు మంటలార్పారు. దట్టమైన పొగతో రెస్క్యూ ఆపరేషన్‌కి ఆటంకాలు కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ పలువురిని రక్షించినప్పటికీ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మంటల్లో పలు ఆఫీసులు, షాప్‌లు పూర్తిగా తగలబడి పోయియాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్‌ను 1980లో నిర్మించినట్లు చెబుతున్నారు.
ఈ ఘటన సమయంలో మంటలు తీవ్రస్థాయిలో ఎగిసిపడుతుండటంతో సమీప నివాసాలకు వ్యాపించే అవకాశం ఉండటంతో స్వప్నలోక్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న నివాసాల్లో ఉన్నవారిని ఖాళీ చేయించారు. ఫైర్ సిబ్బంది నాలుగు గంటలు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చాయి.
సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ అగ్నిప్రమాదం (Swapnalok Fire Accident) పై అగ్నిమాపక శాఖ అధికారులు (Fire Officials) సీరియస్ అయ్యారు. సికింద్రాబాద్ డెక్కన్ మాల్ ప్రమాదం (Secunderabad Deccan Mall accident) తర్వాత కూడా షాపింగ్ మాల్ నిర్వహకుల్లో మార్పు రాని పరిస్థితి. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో దాదాపు 250 పైగా షాపులు ఉన్నాయి. జంటనగరా ల్లోనే అతిపెద్ద పురాతన షాపింగ్ కాంప్లెక్స్‌గా స్వప్నలోక్ భవనానికి పేరు ఉంది. మూడేళ్ల క్రితమే స్వప్నలోక్ భవనం పెచ్చులు ఊడి ఒక వ్యక్తి మృతి చెందాడు. అయితే అధికారుల నోటీస్‌తో తూతూ మంత్రంగా భవన మరమ్మత్తులు చేపట్టారు. ఫైర్ సేప్టీ నిబంధనలను స్వప్నలోక్ కాంప్లెక్స్ యజమాని గాలికి వదిలేశాడు. దీంతో నిన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవాల్సి పరిస్థితి ఏర్పడింది.
సికింద్రాబాద్‌లోని స్వప్పలోక్ కాంప్లెక్స్ ప్రమాద ఘటన స్థలాన్ని చేరుకున్న మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగితెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని అపోలో, యశోద ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.