భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు హైకోర్టులో చుక్కెదురు

ABN , First Publish Date - 2023-09-04T11:16:22+05:30 IST

వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పును వెలువరించింది. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు చుక్కెదురైంది. నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ కుమార్ రెడ్డిల బెయిల్ పిటిషన్‌లను హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే సీబీఐ కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేయడంతో హైకోర్టుకి వెళ్లారు.

భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్ : వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు చుక్కెదురైంది. నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ కుమార్ రెడ్డిల బెయిల్ పిటిషన్‌లను హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే సీబీఐ కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేయడంతో హైకోర్టుకి వెళ్లారు.

గతంలో వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. సునీత, సీబీఐ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. కేసులో మెరిట్స్ ఆధారంగా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉండటంతో బెయిల్ మంజూరు చేయలేమని న్యాయస్థానం భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాదికి స్పష్టం చేసింది. వివేకా హత్యకు జరిగిన కుట్రలో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని సీబీఐ వాదనలు వినిపించింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే జరిగే పరిణామాలను కోర్టుకు సీబీఐ తరపు న్యాయవాది స్పష్టంగా వివరించారు. సీబీఐ, సునీత వాదనల్లో మెరిట్స్ ఉండడంతో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

Updated Date - 2023-09-04T11:16:22+05:30 IST