YS Sharmila: షర్మిల హౌస్ అరెస్ట్..లోటస్ పాండ్ వద్ద టెన్షన్ టెన్షన్

ABN , First Publish Date - 2023-03-17T12:15:24+05:30 IST

లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తతమైన వాతావరణం నెలకొంది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను(YSRTP President Sharmila) పోలీసులు

YS Sharmila: షర్మిల హౌస్ అరెస్ట్..లోటస్ పాండ్ వద్ద టెన్షన్ టెన్షన్

హైదరాబాద్: లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తతమైన వాతావరణం నెలకొంది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను(YSRTP President Sharmila) పోలీసులు హౌస్ అరెస్ట్(House arrest) చేశారు. తన నివాసం నుంచి TSPSC ముట్టడికి బయలుదేరిన షర్మిలను(Sharmila) ముందస్తుగా పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ షర్మిల ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. TSPSC దగ్గర ఆందోళనకు శుక్రవారం షర్మిల పిలుపునిచ్చింది. దీంతో ముందస్తుగానే పోలీసులు షర్మిలను గృహ నిర్బంధం చేశారు. TSPSC లీకేజ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా పేపర్ లీక్‎పై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. పేపర్ లీక్(Paper leak) వ్యవహారంతో రాష్ట్రంలోని టీఆర్ఎస్ భవన్(TRS Bhavan,), ప్రగతి భవన్(Pragati Bhavan), టీఎస్‎పీఎస్సీ కార్యాలయాల(TSPSC offices) ముట్టడితో రాష్ట్రం అట్టుడికి పోతుంది.

TSPSC విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీఎస్‎పీఎస్సీ కార్యాలయంలో ఛైర్మన్ జనార్ధన్ రెడ్డికి వివరణ ఇవ్వాలని వైఎస్సార్ టీపీ భావించింది. అయితే.. TSPSC ముట్టడికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకోవడంతో ఇదే క్రమంలో పోలీసులకు షర్మిలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిలో భాగంగానే వైఎస్ షర్మిలను ఉదయం నుంచే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో లోటస్ పాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తతమైన వాతావణం నెలకొంది. టీఎస్స్‎పీఎస్(TSPSC ) అధికారులకు వివరణ ఇవ్వడానికి ఎందుకు వెళ్లనివ్వడం లేదని పోలీసులపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకుని బయటకు వెళ్లనివ్వడం లేదంటూ పోలీసులు తెలిపారు. ఏమైనా చేయాలనుకుంటే ఇంటి వద్ద నుంచే చేయాలని పోలీసులు సూచించారు. ఈ క్రమంలోనే వైఎస్సార్టీపీ కార్యకర్తలకు తోపులాట జరిగింది. వైస్సార్టీపీ టీఎస్స్‎పీసీ (TSPSC) బాధితులకు అండగా ఉంటామని, ప్రభుత్వం న్యాయం చేసే వరకు పోరాడుతామని షర్మిల తెలిపింది.

Updated Date - 2023-03-17T12:20:00+05:30 IST