Share News

ED: సాహితీ రియల్ ఎస్టేట్‌పై ఈడీ సోదాలు

ABN , Publish Date - Dec 21 , 2023 | 08:12 PM

సాహితీ రియల్ ఎస్టేట్( Sahithi Real Estate ) సంస్థలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ED ) సోదాలు చేసింది. ఈ రైడ్స్‌లో పలు విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇప్పటికే సాహితీ ఇన్‌ఫ్రాపై ఈడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. రూ.161 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ED: సాహితీ రియల్ ఎస్టేట్‌పై ఈడీ సోదాలు

హైదరాబాద్: సాహితీ రియల్ ఎస్టేట్( Sahithi Real Estate ) సంస్థలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ED ) సోదాలు చేసింది. ఈ రైడ్స్‌లో పలు విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇప్పటికే సాహితీ ఇన్‌ఫ్రాపై ఈడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. రూ.161 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ కీలక ఆదేశాలు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ పేరుతో ప్రజల నుంచి రూ.260 కోట్లు, అమీన్‌పూర్‌లో హైరైజ్డ్ బిల్డింగ్ పేరుతో 89 కోట్లు వసూలు చేసింది. అలాగే రూ.126 కోట్ల రూపాయలను వ్యక్తిగతంగా వాడుకున్నట్లు ఈడీ గుర్తించింది. సాహితీ ఎండీ లక్ష్మీనారాయణ, పూర్ణచంద్రరావు ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్ సీసీఎస్ కేసు ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తు జరుపుతోంది.

Updated Date - Dec 21 , 2023 | 08:23 PM