JeevanReddy: అబద్దాలు మాట్లాడితే అరవింద్ నాలుక చీరేస్తాం...

ABN , First Publish Date - 2023-01-31T12:59:20+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై చేసిన వ్యాఖ్యలపై పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

JeevanReddy: అబద్దాలు మాట్లాడితే అరవింద్ నాలుక చీరేస్తాం...

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Telangana CM KCR), మంత్రి కేటీఆర్‌ (Minister KTR)పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ (BJP MP Dharmapuri Arvind)పై చేసిన వ్యాఖ్యలపై పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి (PUC Chairman Jeevan Reddy) కౌంటర్ ఇచ్చారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రాజకీయాల్లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ (Nizamabad MP) ఓ కుసంస్కారి అని అన్నారు. అరవింద్ తాగే నీళ్లు కేసీఆర్ వే.. నడిచే రోడ్డు కేసీఆర్ వేసిందే అన్నారు. అరవింద్ అడ్డగాడిదలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ (KTR) దావోస్ వెళ్లి ఏం చేశారో అరవింద్‌కు తెలియదా అని ప్రశ్నించారు. ఐటీ గురించి అరవింద్ లాంటి లూటీ గాళ్లకు ఏం తెలుసని యెద్దేవా చేశారు. అబద్దాలు మాట్లాడితే అరవింద్ నాలుక చీరేస్తామని ఆయన హెచ్చరించారు.

‘‘అరవింద్... నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై చర్చకు వస్తావా? ఎక్కడైనా చర్చకు నేను సిద్ధం’’ అని సవాల్ విసిరారు. కరెంటు లేదంటున్న అరవింద్.. ఓ సారి కరెంటు తీగలను పట్టుకోవాలని సూచించారు. ఈటెల రాజేందర్ (BJP MLA Etela Rajender) అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు తరుముతారన్నారు. నిజామాబాద్ (Nizamabad) అభివృద్ధిపై ఈటెలతో కూడా చర్చకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నందిపేటలో సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం బీజేపీ కుట్ర అని ఆరోపించారు. బిల్లులు రాలేదనే కారణంతో వాళ్ళు ఆందోళన చేయలేదని.. ఎదో టెన్షన్‌లో అలా చేశానని ఆ సర్పంచ్ తర్వాత చెప్పారని జీవన్ రెడ్డి వెల్లడించారు.

ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్ (MLC V.Gangadhar Goud) మాట్లాడుతూ.. ఎంపీగా అరవింద్ నిజామాబాద్‌కు ఓ చిల్లిగవ్వ కూడా తేలేదని విమర్శించారు. పసుపు బోర్డు తెస్తా అని అరవింద్ మోసం చేశారన్నారు. అరవింద్ ఓ అబద్ధాల కోరని అన్నారు. కేసీఆర్ కుటుంబంపై విమర్శలు తప్ప అరవింద్‌కు ఏదీ చేత కాదన్నారు. అవాకులు చవాకులు బంద్ చేసి అభివృద్ధిపై దృష్టి సారించు అరవింద్ అంటూ హితవుపలికారు. నిజామాబాద్‌లో ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. ఈటెలకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ యే... అది మరచి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ తెలిపారు.

ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం (MLC Yegge Mallesham) మాట్లాడుతూ... ఎంపీగా అరవింద్‌ను ఎందుకు ఎన్నుకున్నామని నిజామాబాద్ ప్రజలు భాధ పడుతున్నారన్నారు. అరవింద్ కేసీఆర్ కుటుంబ సభ్యుల కాలి గోటికి కూడా సరిపోరని అన్నారు. వాళ్ళని విమర్శించే స్థాయి అరవింద్‌కు లేదని తెలిపారు. బీజేపీ తెలంగాణ ఎంపీలు చేత కాని దద్దమ్మలని విమర్శించారు. నీచమైన భాష మాట్లాడితే ప్రజలు అరవింద్ భరతం పడతారని మల్లేశం హెచ్చరించారు.

అరవింద్ ఏమన్నారంటే...

‘‘తెలంగాణ (Telangana) సమాజానికి తెలుసు కేసీఆర్ బ్రోకర్ అని మా నాన్న పెద్దమనిషి’’ అని అన్నారు. నిజమాబాద్‌కు కేసీఆర్, కేటీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘కేటీఆర్ బ్రోకర్ పనులు ఎలా చేస్తారో చెప్తాను. మీ లాగా ఏమైనా దోచుకున్నామా... విద్య, వైద్యంపై ఏమైనా ఆలోచన ఉందా’’ అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల హామీలు తప్ప, ఆచరణలో చేసింది శూన్యమని విమర్శించారు. తెలంగాణ (Telangana State) వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబ సభ్యుల జీవితమే బాగైంది తప్ప, సామాన్య ప్రజల జీవితం దిగజారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోవడం ఖాయమని ఎంపీ అరవింద్ అన్నారు.

Updated Date - 2023-01-31T12:59:21+05:30 IST