Share News

TS NEWS: నారాయణగూడలో రోడ్డు ప్రమాదం.. యువతికి తీవ్రగాయాలు

ABN , Publish Date - Dec 25 , 2023 | 07:48 PM

నగరంలోని నారాయణగూడ ( Narayanaguda )లో రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... బస్టాప్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ యువతిని కెనటిక్ హోండాపై వేగంగా వచ్చిన ఓ యువకుడు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. లిబర్టీ చౌరస్తా నుంచి ఎల్బీ స్టేడియానికి వెళ్లే దారిలో మోర్ మెడికల్ షాప్ ఎదురుగా ఉన్న బస్ స్టాప్‌లో సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో 20 ఏళ్ల యువతి బస్సు కోసం ఎదురుచూస్తుంది.

TS NEWS: నారాయణగూడలో రోడ్డు ప్రమాదం.. యువతికి తీవ్రగాయాలు

హైదరాబాద్: నగరంలోని నారాయణగూడ ( Narayanaguda )లో రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... బస్టాప్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ యువతిని కెనటిక్ హోండాపై వేగంగా వచ్చిన ఓ యువకుడు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. లిబర్టీ చౌరస్తా నుంచి ఎల్బీ స్టేడియానికి వెళ్లే దారిలో మోర్ మెడికల్ షాప్ ఎదురుగా ఉన్న బస్ స్టాప్‌లో సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో 20 ఏళ్ల యువతి బస్సు కోసం ఎదురుచూస్తుంది. అదే సమయంలో కెనటిక్ హోండా పైన వేగంగా వచ్చిన యువకుడు ఢీకొట్టడంతో రెండు కాళ్లు విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు 108 ను పిలిచి ఉస్మానియా ఆస్పత్రికి యువతిని తరలించారు. నారాయణగూడ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి యువకుడిని ప్రమాదానికి గురైన బండిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - Dec 25 , 2023 | 07:48 PM