MRPF Chief: అమిత్ షాను కలిసిన మందకృష్ణ మాదిగ

ABN , First Publish Date - 2023-10-02T16:01:16+05:30 IST

కేంద్రమంత్రి అమిత్ షా‌తో ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షులు మంద కృ‌ష్ణ మాదిగ సోమవారం భేటీ అయ్యారు.

MRPF Chief: అమిత్ షాను కలిసిన మందకృష్ణ మాదిగ

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి అమిత్ షా‌తో (Union Minister Amit Shah) ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షులు మంద కృ‌ష్ణ మాదిగ (MRPF Chief Manda krishna Madiga) సోమవారం భేటీ అయ్యారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు అమిత్ షాను మంద కృష్ణ కలిశారు. ఎస్సీ వర్గీకరణపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని అమిత్ షాకు మందకృష్ణ విజ్ణప్తి చేశారు. సుదీర్ఘకాలం పాటు సాగుతున్న పోరాటానికి న్యాయమైన ముగింపు ఇవ్వాలని ఆయన కోరారు. పార్లమెంటులో త్వరగా బిల్లు పెట్టాలని విజ్ణప్తి చేశారు. మందకృష్ణ విజ్ణప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. భాగస్వామ్య పక్షాలందరితో చర్చించి త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. 7వ తేదీ నుంచి ఆలంపూర్ నుంచి తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నట్లు మందకృష్ణ మాదిగ వెల్లడించారు.

Updated Date - 2023-10-02T16:01:16+05:30 IST