BRS: విష్ణు ఇంటికి మంత్రి హరీష్‌రావు.. బీఆర్‌ఎస్‌లో చేరిక తేదీ ఖరారుకానుందా?
ABN , First Publish Date - 2023-10-30T12:33:25+05:30 IST
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి ఇంటికి మంత్రి హరీష్‌రావు చేరుకున్నారు.
హైదారాబాద్: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి (P Vishnuvardhan Reddy) ఇంటికి మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీలో విష్ణు చేరిక తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. నిన్న (ఆదివారం) ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (CM KCR) కలిసి బీఆర్‌ఎస్‌లో (BRS) చేరికకు విష్ణువర్ధన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
విష్ణును కలిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో చేరాలని విష్ణును కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అవమానించిందని విష్ణు బాధపడ్డారని.. తాము విష్ణు అందరం ఐదేళ్లు శాసనసభ సభ్యులుగా ఉన్నామని తెలిపారు. అనేక ఉద్యమాల్లో విష్ణు తమతో కలిసి పోరాడారని చెప్పారు. బీఆర్ఎస్‌లో చేరేందుకు విష్ణు సుముకుత వ్యక్తం చేశారని తెలిపారు. పట్టపగలు డబ్బు కట్టలతో దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని.. సీట్లు అమ్ముకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) అంటూ విరుచుకుపడ్డారు. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుంది అనేది జనాలు గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అవుతుందని తెలిపారు. ఈ ఎన్నికలు తెలంగాణ వాదులకు తెలంగాణ ద్రోహులకు మధ్య జరుతుగున్న పోటీ అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి కళ్ల ముందు కనపడుతోందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.