Hyderabad: రామ్‌కోఠిలో మెడికల్ కాలేజీ బస్సు బీభత్సం..

ABN , First Publish Date - 2023-08-28T10:38:33+05:30 IST

హైదరాబాద్: రామ్‌కోఠిలో మెడికల్ కాలేజీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి జీహెచ్ఎంసీ కార్మికురాలు సునీతపైకి దూసుకుపోయింది. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో బస్సు డ్రైవర్ బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు.

Hyderabad: రామ్‌కోఠిలో మెడికల్ కాలేజీ బస్సు బీభత్సం..

హైదరాబాద్: రామ్‌కోఠిలో మెడికల్ కాలేజీ బస్సు (Medical College Bus) బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి జీహెచ్ఎంసీ (GHMC) కార్మికురాలు సునీతపైకి దూసుకుపోయింది. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో బస్సు డ్రైవర్ (Bus Driver) బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. సోమవారం తెల్లవారుజామున విధుల్లో భాగంగా స్వీపర్ సునీత రామ్‌కోఠిలో రోడ్ ఊడుస్తోంది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-08-28T10:38:33+05:30 IST