Mal Reddy Ranga Reddy: బీజేపీ నేతల డబుల్ బెడ్ రూమ్ పరిశీలన ఓ డ్రామా..

ABN , First Publish Date - 2023-07-20T15:39:04+05:30 IST

హైదరాబాద్: బీజేపీ నేతలు బాటసింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్లడం ఓ డ్రామా అని మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు బాటసింగారం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు..

Mal Reddy Ranga Reddy: బీజేపీ నేతల డబుల్ బెడ్ రూమ్ పరిశీలన ఓ డ్రామా..

హైదరాబాద్: బీజేపీ నేతలు (BJP Leaders) బాటసింగారంలో డబుల్ బెడ్ రూమ్ (Double Bedroom) ఇళ్ల పరిశీలనకు వెళ్లడం ఓ డ్రామా అని మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి (Mal Reddy Ranga Reddy) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు బాటసింగారం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు.. పోలీసులు వాళ్ళని అడ్డుకుంటున్నట్లు.. మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని, బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) కుమ్మక్కు రాజకీయాల్లో ఇదొక భాగమని అన్నారు. బాట సింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పరిశీలనకు తాము అనేకసార్లు వెళ్ళామని, మమ్మల్ని ఎవరు అడ్డుకోలేదని, పోలీసులు నియంత్రించలేదని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతున్న నేపథ్యంలో కేసీఆర్ (KCR) కావాలనే మళ్లీ బీజేపీని లేపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ జరుగుతున్నట్టుగా ఈ ఎపిసోడ్‌ను చూపిస్తున్నారన్నారు. ఇలాంటివి ఎన్ని నాటకాలు ఆడిన ప్రజలు నమ్మరని, రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ (Congress Wave) మొదలైందని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మల్ రెడ్డి రంగారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-07-20T15:39:04+05:30 IST