Share News

KTR: తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్ 29..

ABN , First Publish Date - 2023-11-26T13:09:07+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్ 29 అని, కేసీఆర్ సత్యాగ్రహం ప్రారంభం అయిన రోజని, ఆయన ఆమరణ దీక్ష సబ్బండ వర్గాలను కదిలించిందని, దెబ్బకు కేంద్రం దిగివచ్చి స్వతంత్య్రం ఇచ్చిందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

KTR: తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్ 29..

హైదరాబాద్: తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్ 29 అని, కేసీఆర్ (KCR) సత్యాగ్రహం (Satyagraha) ప్రారంభం అయిన రోజని, ఆయన ఆమరణ దీక్ష సబ్బండ వర్గాలను కదిలించిందని, దెబ్బకు కేంద్రం దిగివచ్చి స్వతంత్య్రం ఇచ్చిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 29న దీక్ష దివస్‌ను ఘనంగా జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. కాంగ్రెస్ (Congress) తెలంగాణ జాతి మీద చేసిన దాష్టకాలను ప్రజలకు గుర్తు చెయ్యాలన్నారు. ఇళ్ల మీద తెలంగాణ జెండా ఎగరవేయాలని, సేవా కార్యక్రమాలు చేపట్టాలని, అమరుల స్థూపాల వద్ద నివాళులు అర్పించాలని పిలుపిచ్చారు.

పీఎం కిసాన్ (PM Kisan) వేస్తే రేవంత్‌ (Revanth)కు కనిపించదని, ఆ రోజు ఆయన గొంతు ఎందుకు పెగలలేదని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్‌కు బీజేపీ (BJP)తో లోపాయికారీ ఒప్పందం ఉందని, గోశామహల్, కరీంనగర్, కోరుట్లలో డమ్మీ అభ్యర్థులను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. రాజాసింగ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్‌లను ఓడించి తీరుతామన్నారు. తమ పార్టీ అభ్యర్థలపై కూడా ఐటి దాడులు జరుగుతున్నాయన్నారు. కర్ణాటకలో ఉన్నది అట్టర్ ప్లాప్ గవర్నమెంట్ అని, వారు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరన్నారు. తనకు వచ్చిన ఈసీ నోటీసుకు సమాధానం చెబుతానని, నరేంద్రమోదీ (Narendramodi)కి రాహుల్ గాంధీ (Rahul Gandhhi) పెద్ద అస్సెట్ అని కేటీఆర్ వ్యాఖ్యాయించారు.

తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగ నియామకాలు చేసిన రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందా? ఉంటే చూపాలని రాహుల్‌కు కేటీఆర్ సవాల్ చేశారు. కర్ణాటకలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ అయినా ఇచ్చారా?.. రాహుల్ ఒక్క ఉద్యోగ పరీక్ష అయినా రాశారా?.. రేవంత్ ఏనాడైనా ఉద్యోగం చేశారా?.. వీరా నిరుద్యోగుల గురించి మాట్లాడేదంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తాను అనేక ప్రవేశ పరీక్షలు రాశానని, ఉద్యోగం కూడా చేశానని, గోడ మీద సున్నాలు వేసే వ్యక్తి కన్నాలు వేసే స్థాయికి ఎదిగాడన్నారు. రాజకీయ నిరుద్యోగుల మాటలు విని నిరుద్యోగులు ఆగం కావద్దన్నారు. డిసెంబర్ 4న అశోక్ నగర్ వెళ్లి విద్యార్థులతో కూర్చొని జాబ్ క్యాలండర్ ప్రిపేర్ చేస్తానని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-26T13:09:09+05:30 IST