Share News

Kishan Reddy: హస్తినకు రావాలని కిషన్‌రెడ్డికి పిలుపు

ABN , First Publish Date - 2023-10-17T19:07:43+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ టికెట్ల ( Telangana Assembly Tickets ) కు సంబంధించి బీజేపీ పార్టీ (BJP party) అగ్ర నాయకులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

Kishan Reddy: హస్తినకు రావాలని కిషన్‌రెడ్డికి పిలుపు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ టికెట్ల ( Telangana Assembly Tickets ) కు సంబంధించి బీజేపీ పార్టీ (BJP party) అగ్ర నాయకులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రణాళికలో భాగంగానే రేపు సాయంత్రం ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ముఖ్యనేతలకు ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. రేపు కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కిషన్‌రెడ్డి పాల్గొననున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ ఎలాంటి కార్యచరణతో ముందుకు వెళ్లాలి అనే అంశంపై చర్చించనున్నారు. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్టుపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. కసరత్తు అనంతరం ఎల్లుండి బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంది. సుమారు‌ 40మందితో తొలి బాబితాను ప్రకటించే అవకాశం ఉంది. టికెట్ల కేటాయింపులో మహిళలకు, బీసీలకు ప్రాధాన్యతనివ్వాలని కమలం పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మెత్తం సీట్లలో 33శాతం మహిళలకు బీజేపీ పార్టీ కేటాయించనున్నది. ప్రతి బీసీ కులానికి ఒక సీటు ఇచ్చేలా కమలం పార్టీ ప్లాన్ రచిస్తోంది. బీసీల్లో మున్నూరుకాపు, ముదిరాజ్ కులాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకోనున్నది. బీసీ కార్డ్‌తో అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ పార్టీ సిద్ధమవుతోంది.

Updated Date - 2023-10-17T19:07:43+05:30 IST