IRCTC: ప్రయాణికులకు తలనొప్పిగా మారిన ఐఆర్‌సీటీసీ.. డబ్బులు కట్.. టికెట్ నిల్

ABN , First Publish Date - 2023-07-25T12:00:05+05:30 IST

రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ (IRCTC) తలనొప్పిగా మారింది. తత్కాల్, రిజర్వేషన్ టికెట్ల బుకింగ్ చేసుకునే ప్యాసింజర్స్‌కు ఉదయం నుంచీ తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. టికెట్స్ బుక్స్ చేసుకుంటే బుకింగ్ కాకపోవడం.. ఒక వేళ బుక్ అయినా.. డబ్బులు కట్ అవుతున్నాయి గానీ టికెట్ మాత్రం బుకింగ్ కాకపోవడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.

IRCTC: ప్రయాణికులకు తలనొప్పిగా మారిన ఐఆర్‌సీటీసీ.. డబ్బులు కట్.. టికెట్ నిల్

హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ (IRCTC) తలనొప్పిగా మారింది. తత్కాల్, రిజర్వేషన్ టికెట్ల బుకింగ్ చేసుకునే ప్యాసింజర్స్‌కు ఉదయం నుంచీ తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. టికెట్స్ బుక్స్ చేసుకుంటే బుకింగ్ కాకపోవడం.. ఒక వేళ బుక్ అయినా.. డబ్బులు కట్ అవుతున్నాయి గానీ టికెట్ మాత్రం బుకింగ్ కాకపోవడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఉదయం నుంచీ ఐఆర్‌సీటీసీ ముప్పుతిప్పలు పడుతోంది. దీంతో రైల్వేశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి.

IRCTC website సర్వర్ డౌన్ కావడంతోనే టికెట్స్ బుక్ అవ్వడం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఐఆర్‌సీటీసీ (IRCTC)లో సాంకేతిక లోపం తలెత్తిందని.. అందువల్లే ఈ అంతరాయం ఏర్పడిందని ఐఆర్‌సీటీసీ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతానికి తమ వెబ్‌సైట్‌, యాప్‌లో టికెట్‌ బుకింగ్‌ సేవలు అందుబాటులో లేవని పేర్కొంది. సమస్యను పరిష్కరించేందుకు తమ సీఆర్‌ఐఎస్‌ (CRIS) సాంకేతిక బృందం శతవిధాలా ప్రయత్నిస్తోందని తెలిపింది.

సాంకేతిక సమస్య పరిష్కారం అయితే.. ఒకవేళ సేవలు అందుబాటులోకి వస్తే ఆ సమాచారాన్ని అప్‌డేట్ చేస్తామని ఐఆర్‌సీటీసీ ట్విటర్‌లో వెల్లడించింది. అప్పటివరకు ప్రత్యామ్నాయ మార్గాలైన అమెజాన్‌, మేక్‌మైట్రిప్‌ వంటి బీ2సీ వేదికల ద్వారా ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని సూచించింది. తీరా వాటిల్లో కూడా బుక్ చేసుకున్న టికెట్ బుక్ అవ్వట్లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరగా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

WhatsApp Image 2023-07-25 at 11.52.11 AM.jpeg

Updated Date - 2023-07-25T12:03:55+05:30 IST