TS NEWS: తెలంగాణలో పెరిగిన నేరాలు. నివేదిక విడుదల చేసిన సీఐడీ
ABN , Publish Date - Dec 19 , 2023 | 09:42 PM
2022 తెలంగాణ స్టేట్ క్రైమ్ తెలంగాణ డీజీపీ రవిగుప్తా ( DGP Ravigupta ) రికార్డ్ బుక్ విడుదల చేశారు. 2021 కంటే సైబర్ క్రైమ్ కేసులు అధికంగా పెరిగాయి. 48.47 శాతం సైబర్ క్రైమ్, 41.37 శాతం ఎకనామిక్ అఫెన్స్‌లు, 43.30 పెరిగిన చీటింగ్ పెరిగాయి.
హైదరాబాద్ : 2022 తెలంగాణ స్టేట్ క్రైమ్ తెలంగాణ డీజీపీ రవిగుప్తా ( DGP Ravigupta ) రికార్డ్ బుక్ విడుదల చేశారు. 2021 కంటే సైబర్ క్రైమ్ కేసులు అధికంగా పెరిగాయి. 48.47 శాతం సైబర్ క్రైమ్, 41.37 శాతం ఎకనామిక్ అఫెన్స్‌లు, 43.30 పెరిగిన చీటింగ్ పెరిగాయి. గత ఏడాదిలో 1.74 లక్షల సీసీ కెమెరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 10.25 లక్షల సీసీ కెమెరాలు పని చేస్తున్నాయి. సీసీ కెమెరాల ద్వారా 18234 కేసులను పోలీసులు చేధించారు. ఎన్టీఆర్ బీ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా సెఫ్టీ సిటీగా 3వ స్థానంలో హైదరాబాద్ నిలిచింది.
నివేదిక విడుదల చేసిన సీఐడీ
తెలంగాణలో గత ఏడాది మూడు రకాల నేరాలు బాగా పెరిగిపోయాయి. తెలంగాణ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని సీఐడీ విడుదల చేసింది. నివేదికల ఆధారంగా సీఐడీ ఏం చెప్పిందంటే.. ‘‘తెలంగాణలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. నానాటికి ఆర్థిక నేరాల సంఖ్య పెరుగుతుంది. చీటింగ్ మోసాలు చేసే వారి సంఖ్య పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షలకి పైగా సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. సీసీ కెమెరాలని ఉపయోగించి 18 వేల పై చిలుకు కేసులను పోలీసులు చేధించారు. దేశంలో హైదరాబాద్‌కి మూడో అత్యంత సెఫ్టీ సిటీగా ఉంది’’ అని సీఐడీ తెలిపింది.