TS NEWS: హైదరాబాద్‌లో దారుణం.. జీతాలు రావట్లేదని హోంగార్డ్ ఏం చేశారంటే..?

ABN , First Publish Date - 2023-09-05T21:45:21+05:30 IST

నగరంలో దారుణం జరిగింది. ఓ హోంగార్డ్(Home Guard) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది.

TS NEWS: హైదరాబాద్‌లో దారుణం..   జీతాలు రావట్లేదని హోంగార్డ్ ఏం చేశారంటే..?

హైదరాబాద్: నగరంలో దారుణం జరిగింది. ఓ హోంగార్డ్(Home Guard) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌(Chandrayanagutta Traffic Police Station)లో పని చేస్తున్న హోంగార్డ్ రవీందర్(Homeguard Ravinder) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రవీందర్ రక్షపురం నివాసి. గత రెండు నెలల నుంచి జీతాలు రావట్లేదనే మనోవేదనతో సూసైడ్ అటెంక్ట్ చేసినట్లు సమాచారం. గోశామహల్ హోంగార్డు హెడ్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని ఒంటికి హోంగార్డ్ రవీందర్ నిప్పు అంటిచుకున్నాడు. వెంటనే ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు.55% కాలిన గాయాలతో ఉన్న అతనికి ఉస్మానియా వైద్యులు(Osmania) Physicians) చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు.

Updated Date - 2023-09-05T21:45:21+05:30 IST