Hyderabad: భూతవైద్యం బాబా కస్టడీపై అప్‌డేట్స్

ABN , First Publish Date - 2023-03-05T11:30:26+05:30 IST

పోక్సో కేసు (POCSO Act)లో అరెస్టై చంచల్‌గూడ(Chanchalguda) జైల్లో రిమాండ్‌లో ఉన్న రహ్మతాబాద్‌ దర్గా మాజీ ముతవల్లీ (పీఠాధిపతి) హఫీజ్‌పాషాను పోలీసులు కస్టడీలోకి తీసుకుని..

Hyderabad: భూతవైద్యం బాబా కస్టడీపై అప్‌డేట్స్

హైదరాబాద్‌ సిటీ,(ఆంధ్రజ్యోతి): పోక్సో కేసు (POCSO Act)లో అరెస్టై చంచల్‌గూడ (Chanchalguda) జైల్లో రిమాండ్‌లో ఉన్న రహ్మతాబాద్‌ దర్గా మాజీ ముతవల్లీ (పీఠాధిపతి) హఫీజ్‌పాషాను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నకిలీ బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే ఘటన జరిగి దాదాపు చాలా రోజులు గడుస్తున్నా..బాబాను అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు రావడంతో ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బాబానుంచి కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్నివిషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

భూతవైద్యం పేరుతో బాలికపై అత్యాచారం, వేధింపులు కేసులో నకిలీ బాబా బాగోతం అందరికి తెలిసిందే. బాధిత యువతి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే లైంగిక వేధింపులకు పాల్పడ్డ బాబా..గత మూడేళ్లుగా ఆమెను భూతవైద్యం (Exorcism) పేరిట చిత్రహింసలకు గురి చేశాడు. బండారం బయటపడటంతో పెళ్లి చేసుకుంటానని కుటుంబీకులను నమ్మించి మోసానికి పాల్పడ్డాడు. లంగర్‌హౌజ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ.. తొలుత పట్టించుకోని పోలీసులు ఎట్టకేలకు సెక్షన్లు మార్చి పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. దాంతో బాబా లీలలను వెలుగులోకి తీసుకురావడానికి పోలీసులు కసరత్తు చేస్తున్నారు. అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - 2023-03-05T11:32:48+05:30 IST