Naveen Case: పాపం నవీన్.. ప్రేమ వద్దనుకుని చదువు బాట పట్టిన పాపానికి..

ABN , First Publish Date - 2023-03-07T03:27:38+05:30 IST

ముక్కోణపు ప్రేమ కథ ముగ్గురు విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టగా..

 Naveen Case: పాపం నవీన్.. ప్రేమ వద్దనుకుని చదువు బాట పట్టిన పాపానికి..

దిల్‌సుఖ్‌నగర్‌ (ఆంధ్రజ్యోతి): ముక్కోణపు ప్రేమ కథ ముగ్గురు విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టగా.. ప్రేమ వద్దనుకుని చదువు బాట పట్టిన మరో విద్యార్థి జీవితానికి చరమగీతం పాడింది. కారణమేదైనా.. మంచి భవిష్యత్తు ఉన్న నలుగురు విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయి. సంచలనం సృష్టించిన విద్యార్థి నవీన్‌ హత్య కేసు వెనుక ఆసక్తికరమైన అంశాలెన్నో ఉన్నాయి. వీరిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. తెలిసీ, తెలియని వయసులో ప్రేమ పేరిట ఒక అమ్మాయి చుట్టూ తిరిగినప్పటికీ.. కులాలు వేరైనందున అది పెళ్లి పీటల దాకా చేరదని గ్రహించాడు నవీన్‌! ప్రేమను పక్కన పెట్టి చదువుపై దృష్టి సారిస్తే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని భావించాడు. వయసుతో పాటు వచ్చిన కొద్దిపాటి పరిపక్వతతో ఇలా ఆలోచించి.. ప్రియురాలు నీహారిక సెల్‌ఫోన్‌ను బ్లాక్‌ చేసి ఆమెకు దూరంగా ఉంటూ చదువుకుంటున్నాడు.

ఆ సమయంలో.. అతను ప్రేమించిన యువతిని మాయమాటలతో నమ్మించి ప్రేమపేరిట వలలో వేసుకున్నాడు హరిహరకృష్ణ. కానీ, భవిష్యత్తులోనైనా తమ ప్రేమకు నవీన్‌ ఎక్కడ అడ్డంకిగా మారుతాడోననే ఆందోళనతో అతడి ప్రాణాలు నిలువునా తీయడానికి ప్రణాళిక రచించాడు. మర్డర్‌ చేసి, తప్పించుకునే మార్గాల కోసం యూట్యూబ్‌ వీడియోలు, క్రైం సీరియళ్లు, సినిమాలు చూసి.. మూడు నెలలపాటు అతడి హత్యకు ప్రణాళిక రచించాడు. ఆధారాలు లభించకుండా చేస్తే పోలీసుల నుంచి సులువుగా తప్పించుకోవచ్చన్న ధీమాతో హత్య చేశాడు. తన హీరోయిజాన్ని చూపించుకోవడం కోసం.. నవీన్‌ను హత్య చేసిన చోటుకు తన స్నేహితుడు హసన్‌ను, ప్రియురాలు నీహారికను తీసుకెళ్లి వారినీ ఈ నేరంలో భాగస్వాములను చేశాడు. నవీన్‌ మృతదేహాన్ని గుర్తుపట్టకుండా చేసి.. సెల్‌ఫోన్‌లో డేటా డిలీట్‌ చేస్తే పోలీసులు పట్టుకోలేరంటూ హరిహర చెబితే వారిద్దరూ గుడ్డిగా నమ్మారు. చివరికి పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యారు!!

తప్పించుకోలేరు

నేరం చేసి, కాల్‌ డేటా డిలీట్‌ చేస్తే పోలీసుల నుంచి తప్పించుకోవచ్చనుకోవడం అవివేకం. సాంకేతిక నైపుణ్యంతో నేరగాళ్ల ఆట కట్టిస్తాం. కొంచెం ఆలస్యమైనా నిందితులను పట్టుకుని, శిక్షించడం తథ్యం. అమాయకత్వంతోనైనా నేరగాడికి సహకరిస్తే.. దోషిగా నిలబడక తప్పదు. యువత పెడదోవ పట్టకుండా తల్లిదండ్రులు ఎల్లవేళలా వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి.

- సాయిశ్రీ, డీసీపీ

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Naveen Case: హరిహరకృష్ణ ప్రియురాలి అరెస్టు

******************************

Naveen Murder Case : పోలీసు విచారణలో పచ్చి నిజం చెప్పిన హరిహరకృష్ణ.. ఆ ఒక్క మాటతో కంగుతిన్న పోలీసులు..!

******************************

Medico Preethi : డీజీపీ నుంచి వరంగల్ సీపీకి ఫోన్.. కొత్త మలుపులు తిరుగుతున్న డాక్టర్ ప్రీతి కేసు.. ఏం జరుగుతుందో ఏమో..!?

******************************

Updated Date - 2023-03-07T09:35:36+05:30 IST