Rajasingh: హోంగార్డ్ రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వమే అదుకోవాలి

ABN , First Publish Date - 2023-09-06T10:16:27+05:30 IST

ప్రభుత్వం రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హోంగార్డ్ రవీందర్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Rajasingh: హోంగార్డ్ రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వమే అదుకోవాలి

హైదరాబాద్: ప్రభుత్వం రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హోంగార్డ్ రవీందర్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Rajasingh) మాట్లాడుతూ.. హోంగార్డ్ రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వమే అదుకోవాలి అని డిమాండ్ చేశారు. హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని అసెంబ్లీలో సీఎం‌ కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణలో పనిచేస్తోన్న‌ 22వేల హోంగార్డులను పర్మినెంట్ చేయాలన్నారు. మరొక హోంగార్డు రవీందర్ మాదిరి ఆత్మహత్య ప్రయత్నం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు.


కాగా.. ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రభుత్వం రెండు నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదంటూ రవీందర్ పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియా హాస్పిటల్‌కు హోం గార్డులు భారీగా తరలిరావాలని హోం గార్డ్ జేఏసీ పిలుపునిచ్చింది. ఉస్మానియా హాస్పిటల్ వద్ద భారీ ఎత్తున ఆందోళన చెయ్యాలని హోమ్ గార్డ్‌ల సంఘం పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని గత కొంతకాలంగా హోంగార్డు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తమను పర్మినెంట్ చేయాలని గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న హోంగార్డులు.. ఈనెల 16, 17న పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చారు. హోంగార్డులు ఎవరు ఆత్మహత్యలకు పాల్పడొద్దని హోంగార్డు జేఏసీ పిలుపునిచ్చింది. తమన పర్మనెంట్ చేయాలని కేటీఆర్, హరీష్ రావు, కవితలను హోమ్ గార్డ్ జేఏసీ నేతలు కలిశారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో హోమ్ గార్డులు ఆందోళన బాట పట్టారు.

Updated Date - 2023-09-06T10:16:27+05:30 IST