Heavy Rains: భారీ వర్షాలతో జీహెచ్‌ఎంసీ అలెర్ట్.. అవసరమైతేనే రావాలంటూ...

ABN , First Publish Date - 2023-07-20T10:17:19+05:30 IST

గ్రేటర్ హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌కు అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్‌టీంలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Heavy Rains: భారీ వర్షాలతో జీహెచ్‌ఎంసీ అలెర్ట్.. అవసరమైతేనే రావాలంటూ...

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా వర్షం (Heavay Rains) కురుస్తోంది. హైదరాబాద్‌కు అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ (Mayor Gadwal Vijayalakshmi) జీహెచ్ఎంసీ అధికారులను (GHMC Officials) అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్‌టీంలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శిధిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని నగర వాసులకు విజ్ఞప్తి చేశారు. వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ టోల్ ఫ్రీ నెంబర్ 9000113667ను ఏర్పాటు చేశారు.

మరోవైపు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని టోలీచౌకి మరోసారి నీటమునిగింది. నిజాం కాలనీ, మీరాజ్ కాలనీ లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. టోలిచౌకి ఫ్లైఓవర్ కింద డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

Updated Date - 2023-07-20T10:17:19+05:30 IST