Uttam Kumar Reddy: డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే

ABN , First Publish Date - 2023-08-25T14:38:59+05:30 IST

తన అంచనాల ప్రకారం నవంబర్ 30న పోలింగ్ ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) వ్యాఖ్యానించారు. భార్య పద్మావతితో కలిసి ఉత్తమ్ గాంధీభవన్‌కు వచ్చారు. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకున్నారు.

Uttam Kumar Reddy: డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే

హైదరాబాద్: తన అంచనాల ప్రకారం నవంబర్ 30న పోలింగ్ ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) వ్యాఖ్యానించారు. భార్య పద్మావతితో కలిసి ఉత్తమ్ గాంధీభవన్‌కు వచ్చారు. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘ఉమ్మడి నల్గొండలో 12కి 12 సీట్లు గెలిచి క్లీన్‌స్వీప్ చేస్తాం. దేశంలో పర్ క్యాపిటల్ లోన్‌లో తెలంగాణ నంబర్ వన్. ఈరోజు లిక్కర్ తీసుకోవడంలో నెంబర్ వన్. కరప్షన్‌లో తెలంగాణ నంబర్ వన్. రాష్ట్రంలో ఒక్కొక్కరి మీద లక్షా ఇరవై వేల రూపాయల అప్పు చేశారు. అతి పెద్ద సామాజిక వర్గాలు అయిన మాదిగ, ముదిరాజ్ సామాజిక వర్గాలకు మంత్రి పదవి లేదు. టిక్కెట్ల ప్రకటనలో ముదిరాజ్‌లు లేరు. అన్నింటిలో కేసీఆర్ వైఫల్యం చెందారు. రాష్ట్రాన్ని 119 ముక్కలుగా విభజించి ఎమ్మెల్యేలు తమ సామ్రాజ్యంగా భావించి అవినీతి చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇసుక, ల్యాండ్‌, మైన్, వైన్‌గా దోచుకున్నారు.’’ అని ఉత్తమ్ ఆరోపించారు.

‘‘దళిత బంధు, బీసీ బంధు నామమాత్రం పథకాలు. హుజూర్ నగర్‌లో దళిత బంధు అర్హుల దగ్గర కమిషన్ తీసుకున్నారు. అర్హుల దగ్గర పది లక్షల్లో 50 శాతం కమీషన్ తీసుకున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. యూనిట్ రాకముందే కమీషన్ వసూలు చేశారు. దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇండ్ల అన్నింటిలో లంచాలు తీసుకుంటున్నారు. లంచాలు తీసుకోవడంలో అర్హులు ఏ పార్టీ వారు అయినా లంచాలు తీసుకుంటున్నారు. బీఆర్‌ఎస్ వ్యవస్థ మొత్తం దోపిడీ. అక్రమార్జన మీద దృష్టి పెట్టింది తప్ప అభివృద్ధి మీద కాదు. డిసెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కుటుంబ పార్టీ వాళ్లు ఇంట్లో కూర్చుని టిక్కెట్లు ప్రకటిస్తారు. కాంగ్రెస్ పార్టీ అలా చేయదు. కేసీఆర్ రెండు చోట్ల పోటీ అనేది భయంతోనే అని ప్రజలు అనుకుంటున్నారు. కమ్యూనిస్టులను కేసీఆర్ మోసం చేస్తారని నాకు ముందే అర్థం అయింది.’’ అని ఉత్తమ్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-08-25T14:38:59+05:30 IST