TS NEWS: జూబ్లీహిల్స్‌లో భారీగా ఈ సిగరెట్లు పట్టివేత

ABN , First Publish Date - 2023-08-11T15:03:22+05:30 IST

నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లో నిషేధిత ఈ సిగరెట్ల(E cigarettes)ను భారీగా పట్టుకున్నారు.

TS NEWS: జూబ్లీహిల్స్‌లో భారీగా ఈ సిగరెట్లు పట్టివేత

హైదరాబాద్(Hyderabad): నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లో నిషేధిత ఈ సిగరెట్ల(E cigarettes)ను భారీగా పట్టుకున్నారు. ఈ సిగరెట్లను అమ్ముతున్న నలుగురు నిందితులను పట్టుకోని అరెస్ట్ చేశారు. ఈ తనిఖీల్లో రెండు లక్షల విలువైన ఈ సిగరెట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Task Force Police) స్వాధీనం చేసుకున్నారు. ఈ సిగరేట్లను కాలేజీ, స్కూల్ విద్యార్థులకు ముఠా అమ్ముతున్నారు. ముంబై నుంచి చౌకగా ఈ సిగరెట్లు కొని నగరంలో భారీ మొత్తానికి అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. జూబ్లీహిల్స్ కేంద్రంగా ఈ వ్యాపారాన్ని నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల దగ్గరి నుంచి ఈ సిగరేట్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సిగరేట్లను ప్రభుత్వం నిషేధించిందన్నారు. ఎవరైనా ఈ సిగరేట్లను అమ్ముతున్నట్టు గమనిస్తే మా దృష్టికి తీసుకురావలని సూచించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ పోలీసులు హెచ్చరించారు.

Updated Date - 2023-08-11T15:03:22+05:30 IST