Hyderabad: యానిమల్ కేర్ సెంటర్లలో కుక్కల మృతి.. జంతు ప్రేమికుల ఆగ్రహం

ABN , First Publish Date - 2023-05-05T14:07:52+05:30 IST

నగరంలోని యానిమల్ కేర్ సెంటర్లలో వీధి కుక్కల మృత్యువాతపడటం కలకలం రేపుతోంది.

Hyderabad: యానిమల్ కేర్ సెంటర్లలో కుక్కల మృతి.. జంతు ప్రేమికుల ఆగ్రహం

హైదరాబాద్: నగరంలోని యానిమల్ కేర్ సెంటర్లలో వీధి కుక్కల మృత్యువాతపడటం కలకలం రేపుతోంది. జీహెచ్‌ఎంసీ కుటుంబ నియంత్రణ వికటించడంతో కుక్కలు మరణిస్తున్నాయి. ఎల్బీనగర్ జోన్‌లోని నాగోల్ యానిమల్ కేర్ సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెటర్నరీ వైద్యులకు బదులు ఔట్సోర్సింగ్ కార్మికులతో సర్జరీలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. రోజుల తరబడి ఆహారం పెట్టకపోవడంతో మరికొన్ని శునకాలు మృత్యువాత పడుతున్నాయి. గత వారం రోజులుగా నాగోల్ యానిమాల్ కేర్‌లోనే రోజుకు 30కి పైగా కుక్కలు మరణిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నిర్వాకం బయటికి పొక్కకుండా వెటర్నరీ అధికారులు జాగ్రత్త పడుతున్నారు. విషయం తెలిసిన జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియా వెటర్నరీ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2023-05-05T14:08:05+05:30 IST