Congress: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించిన కాంగ్రెస్ నేతలు

ABN , First Publish Date - 2023-09-19T17:25:59+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్(Chandrababu illegal arrest)ను కాంగ్రెస్ నేతలు ఖండించారు. చంద్రబాబుఅక్రమ అరెస్ట్ చాలా దురదృష్టకరమైన సంఘటన అని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్(Sampath Kumar) అన్నారు.

Congress: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించిన కాంగ్రెస్ నేతలు

జోగులాంబ గద్వాల: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్(Chandrababu illegal arrest)ను కాంగ్రెస్ నేతలు ఖండించారు. చంద్రబాబుఅక్రమ అరెస్ట్ చాలా దురదృష్టకరమైన సంఘటన అని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్(Sampath Kumar) అన్నారు. మంగళవారం నాడు వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో కాంగ్రెస్(Congress) పార్టీ అలంపూరు నియోజకవర్గ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీపీ పార్లమెంట్ అబ్జర్వర్ పీవీ మోహన్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుని సరైన కారణాలు సాక్షాలు లేకుండా అరెస్టు చేసి జైల్లో పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రిని ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం భావ్యం కాదని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని సంపత్ కుమార్ హెచ్చరించారు.

Updated Date - 2023-09-19T17:25:59+05:30 IST