Chikoti Praveen: ఈనెల12న బీజేపీలోకి చీకోటి ప్రవీణ్

ABN , First Publish Date - 2023-09-10T22:35:25+05:30 IST

చీకోటి ప్రవీణ్Chikoti Praveen) బీజేపీలో చేరేందుకు ముహర్తం ఖరారైంది. చీకోటి ప్రవీణ్ కూడా బీజేపీ(BJP)లో చేరడంపై క్లారిటీ ఇచ్చారు.

Chikoti Praveen:  ఈనెల12న బీజేపీలోకి చీకోటి ప్రవీణ్

హైదరాబాద్: చీకోటి ప్రవీణ్Chikoti Praveen) బీజేపీలో చేరేందుకు ముహర్తం ఖరారైంది. చీకోటి ప్రవీణ్ కూడా బీజేపీ(BJP)లో చేరడంపై క్లారిటీ ఇచ్చారు. ఈనెల 12వ తేదీన కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) సమక్ష్యంలో కాషాయ కండువా వేసుకోనున్నారు. మోదీ స్ఫూర్తితోనే బీజేపీలోకి వెళ్తున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అక్రమాలకు బీజేపీనే అడ్డుకోగలదని.. అందుకనే బీజేపీలో చేరుతున్నట్లు చీకోటి ప్రవీణ్ ప్రకటించారు. 12వ తేదీన తెలంగాణ స్టేట్ బీజేపీ ఆఫీస్‌లో పార్టీలో జాయిన్ కానున్నారు.

అయితే చీకోటి ప్రవీణ్‌ చేరిక సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులతో కలిసి భారీ ర్యాలీతో రానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో ప్రధాన నిందితుడు చీకోటి ప్రవీణ్. ఇక రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు ఆయన ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చీకోటి ప్రవీణ్ పోటీ చేస్తారని తెలుస్తోంది. హైదరాబాద్‌‌లోని ఓ నియోజక వర్గం నుంచి బరిలో దిగనున్నట్లు సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వివిధ పార్టీల నేతలు దూకుడు పెంచాయి. ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. ఇతర పార్టీల్లో ఉన్న ముఖ్య నేతలకు గాలం వేస్తున్నాయి. వారికి టికెట్లు, పదవుల ఆశ చూపి తమ పార్టీల్లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

Updated Date - 2023-09-10T22:35:25+05:30 IST