Share News

CBN: అభిమానుల కోలాహలం మధ్య ఇంటికి చేరుకున్న చంద్రబాబు

ABN , First Publish Date - 2023-11-01T20:09:57+05:30 IST

అభిమానుల కోలాహలం మధ్య తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) హైదరాబాద్‌లోని ఇంటికి చేరుకున్నారు.

CBN: అభిమానుల కోలాహలం మధ్య ఇంటికి చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్: అభిమానుల కోలాహలం మధ్య తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) హైదరాబాద్‌లోని ఇంటికి చేరుకున్నారు. బాబు నివాసం వద్ద టీడీపీ కార్యకర్తలు, అభిమానులు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. జై బాబు అంటూ అభిమానులు నినాదాలు చేశారు. చంద్రబాబు నివాసం వద్ద మాజీ ఎంపీ మాగంటి బాబు, టీడీపీ నేతలు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. రేపు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో బాబుకు కంటి పరీక్షలు చేయనున్నారు. 52 రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత చంద్రబాబు నాయుడు, వైద్య కారణాలతో నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌పై నిన్న బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-11-01T20:09:57+05:30 IST