TS NEWS: కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు: మదన్ కుమార్
ABN , First Publish Date - 2023-08-23T17:03:20+05:30 IST
సీఎం కేసీఆర్(CM KCR)ని ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగిన ఇవ్వలేదని బీఎస్పీ నేత మదన్ కుమార్(BSP leader Madan Kumar) అన్నారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్(CM KCR)ని ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగిన ఇవ్వలేదని బీఎస్పీ నేత మదన్ కుమార్(BSP leader Madan Kumar) అన్నారు. తెలంగాణ ఉద్యమం(Telangana Movement) నుంచి పోరాడుతూ రాష్ట్రం వచ్చే వరకు కేసీఆర్‌తో ఉన్నానని.. మనకు వచ్చిన తెలంగాణ మనకి సంపూర్ణ తెలంగాణ కాదన్నారు. దామాషా ప్రకారం కులాల వారీగా రావాల్సిన సీట్లు కేటాయించని పరిస్థితి ఉంది. నిధులు, నియమాకల పేరుతో సాధించిన తెలంగాణలో ఎందుకు యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఇప్పుడు రైతులను కూడా మోసం చేస్తున్నారు. తెలంగాణలో కౌలు రైతులను మోసం చేస్తున్నారు. వందలాది ఏకరాలున్న అగ్రకులస్తులు, ఎవుసం చేయకున్న రైతు బంధు ఇస్తావు. నా వృత్తి వదిలి ఉద్యమంలో పనిచేశా.. ఇప్పుడు ఏ పార్టీ చూసిన అగ్రకులస్తుల చేతిలోనే ఉంది. బహుజనుల కోసం ఏర్పడిన పార్టీ బహుజన సమాజ్ వాజ్ పార్టీ ఒకట్టే ఉంది. నేను బహుజన సమాజ్ వాజ్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది’’ అని మదన్ కుమార్ తెలిపారు.