K Keshavarao: ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. మా లోపాలను సమీక్షిస్తాం..
ABN , First Publish Date - 2023-12-04T15:21:54+05:30 IST
Telangana: తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె. కేశవ రావు స్పందించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె. కేశవరావు (BRS Parliamentary Party leader Dr. K. Keshav Rao) స్పందించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్నారు. ప్రపంచం మెచ్చేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలో అమలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది అని చెప్పుకొచ్చారు. ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించడానికి కారణాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. తమ లోపాలను కచ్చితంగా సమీక్షించుకుంటామన్నారు. కొత్తగా కొలువు తీరబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు దిశగా కొత్త ప్రభుత్వం పని చేయాలని కోరుకుంటున్నట్లు కేకే వెల్లడించారు. ఈ మేరకు సోమవారం పత్రికా ప్రకటన విడుదలైంది.