BRS MLC: రెండేళ్లుగా చూస్తున్నాం...ఏమీ ఇవ్వడం లేదు.. కేంద్రబడ్జెట్‌పై కవిత

ABN , First Publish Date - 2023-02-01T15:30:03+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

BRS MLC: రెండేళ్లుగా చూస్తున్నాం...ఏమీ ఇవ్వడం లేదు.. కేంద్రబడ్జెట్‌పై కవిత

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం (Union Budget - 2023) ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఇది కేంద్ర బడ్జేటా లేక కొన్ని రాష్ట్రాల కోసం పెట్టిన బడ్జెటా’’ అని ప్రశ్నించారు. రెండేళ్లుగా చూస్తున్నామని తెలంగాణ (Telangana State)కు ఏమీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. 197 నర్సింగ్ కాలేజీలు ప్రకటించారని... ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. కర్ణాటక (Karnataka)లో అప్పర్ భద్ర ప్రాజెక్ట్ (Upper Bhadra Project) కోసం రూ. 5300 కోట్లు ఇచ్చారన్నారు. మరి కాళేశ్వరం (Kaleshwaram Project), మిషన్ భగీరథ (Mission Bhagiratha) సంగతేంటని ప్రశ్నించారు. నీతి అయోగ్ (NITI Aayog) చెప్పినా ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు.

కేంద్ర బడ్జెట్‌లోని అంశాలు...

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Union Minister Nirmala Sitaraman) 2023-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ (Union Budget - 2023) ను పార్లమెంటు (Parliament)లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రైల్వే (Railways)లకు పెద్ద పీట వేశారు. సప్తరుషుల తీరుగా బడ్జెట్‌లో ఏడు అంశాలకు కేంద్రమంత్రి ప్రాధాన్యత ఇచ్చారు. గంటా 26 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. ఈ బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరటనిస్తూ నిర్మలా సీతారామన్ (Union Minister) ప్రకటన చేశారు. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి రూ.7లక్షల వరకు ఆదాయపు పన్నులో మినహాయింపు ఇచ్చారు. అలాగే తెలుగు రాష్ట్రాలోని పలు సంస్థలకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి.

తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు...

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీకి రూ. 47 కోట్లు, పెట్రోలియం యూనివర్సిటీకి రూ. 168 కోట్లు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రూ. 683 కోట్లు కేటాయించడం జరిగింది.

  • తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి.... సింగరేణికి రూ.1,650 కోట్లు, ఐఐటీ హైదరాబాద్‌కు ఈఏపీ కింద రూ.300 కోట్లు కేటాయించారు.

  • రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ.37 కోట్లు, మంగళగిరి, బిబినగర్‌ సహా దేశంలోని 22 ఎయిమ్స్‌ ఆసుపత్రులకు రూ. 6,835 కోట్లు, సాలార్జంగ్‌ సహా అన్ని మ్యూజియంలకు రూ. 357 కోట్లు, మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు రూ. 1,473 కోట్లు, ఇంకాయిస్‌కి రూ. 27 కోట్లు కేటాయించడం జరిగింది.

  • కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ. 41,338 కోట్లు, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉంది.

Updated Date - 2023-02-01T15:50:03+05:30 IST