Marri Janardhan Reddy: ఐటీ వాళ్లు వస్తారు.. చెక్ చేసుకుంటారు.. కడిగిన ముత్యంలా వస్తాం

ABN , First Publish Date - 2023-06-15T12:07:01+05:30 IST

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో రెండో రోజు ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మర్రి జనార్ధన్ రెడ్డి ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. వ్యాపారం చేస్తున్నప్పుడు ఐటి వాళ్ళు వస్తారు... చెక్ చేసుకుంటారని అన్నారు. ‘‘మేము చెప్పేది చెబుతాం వాళ్ళు అడిగేది అడుగుతారు.. నా లెక్కలు క్లియర్ గా ఉన్నాయి కడిగిన ముత్యం లా వస్తాం’’ అని చెప్పుకొచ్చారు.

Marri Janardhan Reddy: ఐటీ వాళ్లు వస్తారు.. చెక్ చేసుకుంటారు.. కడిగిన ముత్యంలా వస్తాం

హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి (BRS MLA Marri Janardhan Reddy) కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో రెండో రోజు ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మర్రి జనార్ధన్ రెడ్డి ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో (ABN - Andhrajyothy) మాట్లాడుతూ.. వ్యాపారం చేస్తున్నప్పుడు ఐటి వాళ్ళు వస్తారు... చెక్ చేసుకుంటారని అన్నారు. ‘‘మేము చెప్పేది చెబుతాం వాళ్ళు అడిగేది అడుగుతారు.. నా లెక్కలు క్లియర్ గా ఉన్నాయి కడిగిన ముత్యం లా వస్తాం’’ అని చెప్పుకొచ్చారు. ఐటీ సోదాలు ఎన్ని రోజులు జరిగినా సహకరిస్తామన్నారు. మోదీ ది కొత్త రాజ్యాంగామా..? తాము వ్యాపారం చేయోద్దా అని ప్రశ్నించారు. భూములు కొనడం, అమ్మడం కూడా తప్పా అని ప్రశ్నించారు. ఐటి అధికారులు తనకు అవార్డ్ ఇచ్చి వెళ్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు రూ.150 కోట్ల వరకు ట్యాక్స్ కట్టినట్లు చెప్పారు. ‘‘మా ఉద్యోగులను ఐటీ అధికారులు కొడుతున్నారని తెలుస్తోందన్నారు. తిరిగి దాడి చేయటం మాకు తెలుసు.. వాళ్ళ ప్రవర్తన మితి మీరితే మాకు కూడా తిరగబడడం తెలుసు. లెక్కల్లో తేడాలు ఉంటే డబ్బులు కట్టించుకోవాలి’’ అని అన్నారు. పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తానని మర్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు.

కాగా... రెండో రోజు కూడా మర్రి జనార్ధన్ రెడ్డికి చెందిన జేసీ బ్రదర్స్ షోరూమ్స్‌తో పాటు అమీర్‌పేట్‌లోని కార్పొరేట్ ఆఫీసులో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేసీ బ్రదర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో మర్రి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన కొత్తూరు పైపుల కంపెనీలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అటు భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి నివాసాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు.

ఎంపీకి నోటీసులు...

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (MP Kotha Prabhakar Reddy) ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు ముగిశాయి. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు ఐటీ సోదాలు కొనసాగాయి. చివరకు ఎంపీకి నోటీసులు ఇచ్చి ఐటీ అధికారులు వెళ్లిపోయారు. అవసరం ఉన్నప్పుడు విచారణకు సహకరించాలని నోటీసుల్లో పేర్కొన్న ఐటీ అధికారులు.

Updated Date - 2023-06-15T12:07:01+05:30 IST