Share News

TS Election: కమలానికి గుడ్‌బై చెప్పి కారెక్కిన తుల ఉమ

ABN , First Publish Date - 2023-11-13T16:02:08+05:30 IST

తొలుత వేములవాడ బీజేపీ టికెట్ తుల ఉమకే కేటాయించారు. చివరి నిమిషంలో మాత్రం అంతా తారుమారైపోయింది. బీఫామ్ ఇవ్వకుండా పార్టీ నిరాశ పరిచింది. ఈ పరిణామంతో

TS Election: కమలానికి గుడ్‌బై చెప్పి కారెక్కిన తుల ఉమ

హైదరాబాద్: బీజేపీకి తుల ఉమ గుడ్‌బై చెప్పి గులాబీ గూటికి చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. కండువా కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. నాలుగు రోజులుగా సాగుతున్న హైడ్రామాకు తెరపడింది. బీజేపీ టికెట్ ఇచ్చినట్టే.. ఇచ్చి వెనక్కి తీసుకుంది. దీంతో ఆమె కమలం పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనంతరం అనేక పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చాయి. కానీ చివరికి ఆమె కారెక్కారు.

తొలుత వేములవాడ బీజేపీ టికెట్ తుల ఉమకే కేటాయించారు. చివరి నిమిషంలో మాత్రం అంతా తారుమారైపోయింది. బీఫామ్ ఇవ్వకుండా పార్టీ నిరాశ పరిచింది. ఈ పరిణామంతో ఆమె షాక్ అయ్యారు. తుల ఉమకు కాకుండా మరొకరికి కేటాయించింది. ఈ సంఘటనతో ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అనుచరులతో సమావేశాల అనంతరం ఆమె బీఆర్ఎస్‌లో చేరారు.

Updated Date - 2023-11-13T16:04:14+05:30 IST