Share News

BJP MP Laxman: ఏ క్షణంలో అయినా అభ్యర్థుల ప్రకటన

ABN , First Publish Date - 2023-10-21T10:47:21+05:30 IST

మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులపై బీజేపీ కసరత్తు చేపట్టింది. మరికాపట్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల జాబితాల విడుదలకానుంది. అభ్యర్థుల ప్రకటనపై ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని తెలిపారు. తెలంగాణ నుంచి 50 పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి అందించామని.. ఏ క్షణంలో అయినా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అన్నారు.

BJP MP Laxman: ఏ క్షణంలో అయినా అభ్యర్థుల ప్రకటన

న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులపై బీజేపీ కసరత్తు చేపట్టింది. మరికాపట్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల జాబితాల విడుదలకానుంది. అభ్యర్థుల ప్రకటనపై ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని తెలిపారు. తెలంగాణ (Telangana State) నుంచి 50 పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి (Central Election Committee) అందించామని.. ఏ క్షణంలో అయినా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అన్నారు. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తుందన్నారు. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్ద పీట వేసిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. మహిళలకు సీట్ల విషయంలో బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తుందని ఎంపీ మండిపడ్డారు.


ఢిల్లీలో కవిత (BRS MLC Kavitha) ధర్నాలు చేశారని.. కానీ మహిళలకు సీట్లు ఇవ్వలేదని విమర్శించారు. మొదటి విడతలో బీసీలకు 20 పైగా సీట్లు కేటాయిస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌లు బీసీలను పట్టించుకోవడం లేదని.. కాంగ్రెస్ పార్టీ బీసీల సేవలు వాడుకుని వదిలేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. బీసీ సమాజం బీజేపీ వైపు చూస్తోందన్నారు. బీసీలకు పెద్దపీట వేస్తున్న పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలను బీజేపీ అమలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీలను బానిసలుగా చూస్తున్నారని అన్నారు. బీసీలకు బీజేపీ అవకాశం కల్పిస్తుందని చెప్పారు. రాజాసింగ్ సస్పెన్షన్ పోటీ అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తోందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు బీసీలకు బీజేపీ కేటాయిస్తుందని వెల్లడించారు. ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలు తెలంగాణ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటారని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-21T10:47:21+05:30 IST