Bandi Sanjay: గవర్నర్, మహిళలపై కేసీఆర్‌కు గౌరవం లేదు

ABN , First Publish Date - 2023-01-23T15:03:31+05:30 IST

చట్టంలోని లొసుగులను కేసీఆర్ విస్తృతంగా వాడుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.

Bandi Sanjay: గవర్నర్, మహిళలపై కేసీఆర్‌కు గౌరవం లేదు

హైదరాబాద్: చట్టంలోని లొసుగులను కేసీఆర్ (Telangana CM KCR) విస్తృతంగా వాడుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ BJP Leader Bandi Sanjay)విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... గవర్నర్, మహిళల మీద సీఎం కేసీఆర్‌కు గౌరవం కూడా లేదన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండా చేసేందుకే సాంకేతిక కారణాలు చూపుతున్నారని మండిపడ్డారు. కావాలనే అసెంబ్లీని ప్రొరోగ్ చేయకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. ఖమ్మం సభలో షౌవుకారులంటూ వైశ్యులను కేసీఆర్ అవమానించారని అన్నారు. దీనిని ఒక్క వైశ్య సంఘాం కానీ.. వైశ్య లీడర్ గాని ఖండించలేదన్నారు. కేసీఆర్ టైం బాలేదని.. ఏమి చేసినా కథ అడ్డం తిరుగుతోందని తెలిపారరు. ఉపాద్యాయుల ట్రాస్ఫర్స్‌తో 317 జీవో మరోసారి తెరపైకి వచ్చిందన్నారు. ఉపాధ్యాయులతో పాటు, ఆర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-01-23T15:03:31+05:30 IST