Bandi Sanjay: మహిళా కమిషన్‌కు బండి సంజయ్ వివరణ

ABN , First Publish Date - 2023-03-18T12:56:46+05:30 IST

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌కు ఆయన శనివారం రెండు పేజీల లేఖలో వివరణ ఇచ్చారు.

Bandi Sanjay: మహిళా కమిషన్‌కు బండి సంజయ్ వివరణ

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌ (Womens Commission)కు ఆయన శనివారం రెండు పేజీల లేఖలో వివరణ ఇచ్చారు. కవితను ఉద్దేశించి మాట్లాడిన మాటలను సమర్థించుకున్నారు. తెలంగాణ (Telangana) వాడుక భాషలో ఉపయోగించే పదాలనే తాను మాట్లాడినట్లు సమాధానం ఇచ్చారు. తెలంగాణ కుటుంబ సభ్యులు ఉపయోగించే భాషనే ఉపయోగించినట్లు చెప్పారు. బండి‌ సంజయ్ సమాధానం పట్ల మహిళా కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇంకా విచారణ కొనసాగుతోంది.

మరోవైపు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ మహిళా‌ కార్యకర్తలు (BRS Women Activists) మహిళా కమిషన్ వద్ద ఆందోళన చేపట్టారు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కాగా ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మహిళ కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఆయనకు నోటీసులు జారీ చేసింది. ‘తప్పు చేసిన కవితను అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా’ అంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకున్న మహిళ కమిషన్.. ఈ నెల 13న వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటిసులు ఇచ్చింది. అయితే పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున శనివారం హాజరవుతానంటూ..మహిళ కమిషన్‌కు సంజయ్ సమాధానం ఇచ్చారు.

Updated Date - 2023-03-18T12:56:46+05:30 IST