TS NEWS: ఆయుర్వేదిక్ డెవలపర్ పేరిట కుచ్చు టోపీ
ABN , Publish Date - Dec 26 , 2023 | 07:55 PM
ఆయుర్వేదిక్ డెవలపర్ పేరిట తన్విత గ్రూప్ కంపెనీ బాధితులకు కుచ్చు టోపీ పెట్టింది. కోట్లలో మోసపోయిన బాధితులు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పది రకాల తన్విత గ్రూప్ కంపెనీలకు పెట్టుబడులు పెట్టేలా బాధితులను మోసం చేసింది. లక్షకు 8వేల చొప్పున ప్రతి నెల ఇస్తామని బాధితులకు ఆశ చూపించింది.
హైదరాబాద్(జీడిమెట్ల): ఆయుర్వేదిక్ డెవలపర్ పేరిట తన్విత గ్రూప్ కంపెనీ బాధితులకు కుచ్చు టోపీ పెట్టింది. కోట్లలో మోసపోయిన బాధితులు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పది రకాల తన్విత గ్రూప్ కంపెనీలకు పెట్టుబడులు పెట్టేలా బాధితులను మోసం చేసింది. లక్షకు 8వేల చొప్పున ప్రతి నెల ఇస్తామని బాధితులకు ఆశ చూపించింది. ఈ సంస్థకు వనస్థలిపురంలో ప్రధాన కార్యాలయం ఉంది. దీనికి సంబంధించిన మరో బ్రాంచ్‌ని తొర్రూరులో ఉంది. ఫిర్యాదు చేసిన బాధితుడికి మనుషులను పంపిస్తానని తన్విత గ్రూప్ కంపెనీ ప్రతినిధులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. దీంతో మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసి తనకు రక్షణ కల్పించాలని స్థానిక పోలీస్ స్టేషన్‌లో వినతి పత్రం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.