Allu Arjun: తెలంగాణ ఎన్నిక‌ల్లో అల్లు అర్జున్.. మామకు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం..

ABN , First Publish Date - 2023-08-11T15:19:52+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో ఈసారి సినీ ప్రముఖుల రాజకీయ ఎంట్రీలు పెద్ద ఎత్తున కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ మామకు మద్దతుగా రంగంలోకి దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Allu Arjun: తెలంగాణ ఎన్నిక‌ల్లో అల్లు అర్జున్.. మామకు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం..

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో ఈసారి సినీ ప్రముఖుల (Movie Celebrities) రాజకీయ ఎంట్రీ (Political Entry)లు పెద్ద ఎత్తున కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ (Allu Arjun) మామకు మద్దతుగా రంగంలోకి దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 19న నాగార్జునసాగర్ (Nagarjunasagar) నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. వచ్చే ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (Kancharla Chandrasekhar Reddy) పోటీ చేస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ (TRS) అభ్యర్థిగా ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి ఓటమిచెందారు. అప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్న కంచర్ల.. ఎన్నికల ముందు మళ్లీ యాక్టీవ్ అయ్యారు. దాంతో మామ కోసం అల్లుడు అల్లు అర్జున్ ప్రచారం చేయనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-11T15:19:52+05:30 IST