Hyd Traffic Alert: గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్లే రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకంటే..

ABN , First Publish Date - 2023-07-04T09:35:46+05:30 IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి వస్తున్న సందర్భంగా మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. గచ్చిబౌలి స్టేడియం సందర్శన సందర్భంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 వరకు గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్లే రూట్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి.

Hyd Traffic Alert: గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్లే రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకంటే..

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి వస్తున్న సందర్భంగా మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. రాష్ట్రపతి ఉదయం 10 నుంచి 10:30 సమయంలో హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. ఆ సమయంలో హనుమాన్‌ ఆలయం, హకీంపేట వై జంక్షన్‌, బొల్లారం చెక్‌పోస్టు, నేవీ జంక్షన్‌, యాప్రాల్‌ రోడ్డు, హెలీప్యాడ్‌ వై జంక్షన్‌, లోతుకుంట ప్రాంతాల్లో కొద్దిసేపు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి.

గచ్చిబౌలి స్టేడియం సందర్శన సందర్భంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 వరకు గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్లే రూట్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి. రాష్ట్రపతి భవన్‌ పరిసర ప్రాంతాల్లో రోజంతా ఆంక్షలు ఉంటాయని, ప్రజలు సహకరించాలని కోరారు.

Updated Date - 2023-07-04T09:35:49+05:30 IST