Share News

TS NEWS: ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌

ABN , Publish Date - Dec 24 , 2023 | 08:24 PM

ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ కాల్‌ సెంటర్ ద్వారా సైబర్ నేరగాడు మోసాలకు పాల్పడతున్నాడు. నోయిడాలో నిందితుడు విజయ్‌కాంత్‌ను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు నుంచి 6 లాప్‌ట్యాప్‌లు, 23 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

TS NEWS: ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌

హైదరాబాద్‌: ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ కాల్‌ సెంటర్ ద్వారా సైబర్ నేరగాడు మోసాలకు పాల్పడతున్నాడు. నోయిడాలో నిందితుడు విజయ్‌కాంత్‌ను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి 6 లాప్‌ట్యాప్‌లు, 23 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగం పేరిట ఓ బాధితురాలి నుంచి రూ.2.20 లక్షలు నిందితుడు కాజేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

వాహనాలు ఇప్పిస్తామని మోసం చేసిన ముఠా అరెస్ట్‌

వాహనాలు ఇప్పిస్తామని మోసం చేసిన ఓ ముఠాని పోలీసలు అరెస్ట్‌ చేశారు. తక్కువ ధరకే మహీంద్ర వాహనాలు ఇప్పిస్తామని మోసం ముఠా చేసింది. ఈ కేసులో రాజమండ్రికి చెందిన ముగ్గురు సభ్యుల ముఠాని అరెస్ట్‌ చేశారు. ఓ బాధితుడు రత్నం ఫిర్యాదుతో నిందితులు అరెస్ట్‌ చేశారు. మహీంద్ర సంస్థ CEO పేరుతో బాధితుడికి నిందితులు ఫోన్‌ చేశారు. వాహనాల కోసం రూ.3.54 లక్షలు పంపాలని నేరగాళ్లు చెప్పారు. నిందితులు చెప్పిన ఖాతాలో బాధితుడు నగదు జమ చేశారు. నగదు వారి అకౌంట్లో పడ్డాక బాధితుడికి వారి దగ్గరి నుంచి సమాచారం లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - Dec 24 , 2023 | 08:24 PM