TS Politics : అసెంబ్లీలో కేసీఆర్ ఎన్నికల హామీలు.. అన్నీ శుభవార్తలే చెప్పిన సీఎం!

ABN , First Publish Date - 2023-08-06T18:04:00+05:30 IST

అవును.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ సీఎం కేసీఆర్ (CM KCR) నుంచి శుభవార్తలు (Good News) ఎక్కువవుతున్నాయి.! ఆ మధ్య దివ్యాంగులకు పెన్షన్ వెయ్యి పెంపు, విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంపు, బీసీ బంధు, ముస్లింలకు లక్ష రూపాయిల ఆర్థిక సాయం, ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు విలీనం ఇలా వరుస శుభవార్తలు చెప్పిన కేసీఆర్.. ఆదివారం నాడు తెలంగాణ అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటనలు చేశారు..

TS Politics : అసెంబ్లీలో కేసీఆర్ ఎన్నికల హామీలు.. అన్నీ శుభవార్తలే చెప్పిన సీఎం!

అవును.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ సీఎం కేసీఆర్ (CM KCR) నుంచి శుభవార్తలు (Good News) ఎక్కువవుతున్నాయి.! ఆ మధ్య దివ్యాంగులకు పెన్షన్ వెయ్యి పెంపు, విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంపు, బీసీ బంధు, ముస్లింలకు లక్ష రూపాయిల ఆర్థిక సాయం, ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు విలీనం ఇలా వరుస శుభవార్తలు చెప్పిన కేసీఆర్.. ఆదివారం నాడు తెలంగాణ అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటనలు చేశారు. ఇంతకీ ఆ కీలక ప్రకటనలు ఏంటి..? గులాబీ బాస్ చెప్పిన ఆ గుడ్ న్యూస్‌లు ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..!


CM-KCR.jpg

ఉద్యోగులకు గుడ్ న్యూస్!

ఉద్యోగులకు పేస్కేల్ (Pay Scale) పెంచుతామని, దేశం ఆశ్చర్యపోయేలా పెంపు ఉంటుందని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు. అతి త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులు కూడా తమ పిల్లలేనని, వాళ్లను బాగా చూసుకుంటామని కేసీఆర్ తెలిపారు. ఆర్థిక వనరులు సమకూరగానే మళ్లీ జీతాలు పెంచుతామని గులాబీ బాస్ తెలిపారు. కేసీఆర్ ప్రకటనతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అటు పెన్షన్లు .. ఇటు బోనస్..!

ఓట్లకోసం ఎవరు ఏం అనుకుంటారో అని మేము భయపడం. కర్ణాటకలో ఎన్ని హామీలు ఇచ్చినా బీజేపీని తన్ని తరిమేశారు. రూ. 4 వేలు పెన్షన్ పెంచుతామని కాంగ్రెస్ అంటుంది. మేము రూ. 5 వేలు పెంచుతామని అంటాం..అలా చెప్పడం కాదు..చేయాలి. అందుకే మేము సాధ్యం అయ్యేదే చెబుతాం.. చేస్తాం. పెన్షన్లు కచ్చితంగా పెంచుతాం.. కానీ ఒకేసారి పెంచం. కాంగ్రెస్ అలవి కానీ హామీలు ఇస్తోంది. చేయగలిగేది చెప్పాలి.. అలా కాని పక్షంలో ప్రజలు నమ్మరు. మా అమ్ముల పొదిలో ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయి. దేశంలో ఎక్కువ వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులు మాత్రమే. సింగరేణిని (Singareni Employees) నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీయే. అప్పులు కట్టలేక 49 శాతం వాటాను కాంగ్రెస్ (Congress) అమ్మేసింది. సింగరేణి కార్మికులకు వెయ్యి కోట్లు బోనస్ ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ పాలనలో ఐటి ఉద్యోగుల సంఖ్య 3లక్షలు, మా పాలనలో 6లక్షల 15వేలుఅని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.

CM-KCR-Assembly.jpg

విమర్శనాస్త్రాలు..!

ఉన్న తెలంగాణను ఊడ గొట్టింది కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ. తెలంగాణ ఉన్నది ఉన్నట్టు ఉంటే ఎక్కడో ఉండేది. ఎకసెక్కాలు చేసిన ఏపీ కంటే మన.. పర్ క్యాపిటా లక్ష రూపాయలు ఎక్కువ. సమ్మిళిత అభివృద్ధితోనే ఇది సాధ్యం అయింది. తెలంగాణ పట్ల కాంగ్రెస్ కర్కశంగా వ్యవహరించింది. కేంద్రంలో మమ్మల్ని రాసి రంపాన పెట్టే పార్టీ ప్రభుత్వమే ఉంది. అయినా ప్రతి మూడు నెలలకోసారి అవార్డులు తీసుకుంటున్నాంఅని కాంగ్రెస్‌పై (Congress) విమర్శనాస్త్రాలు సంధించారు కేసీఆర్. ఇక ఇదే అసెంబ్లీ వేదికగా.. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై (Bandi Sanjay) కేసీఆర్ సెటైర్లేశారు. బండి పోతే బండి గుండు పోతే గుండు ఇస్తా అన్నొడు పత్తా లేకుండా పోయిండన్నారు. రైతులు పండించిన పంట మొత్తం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ (Telangana) అన్నారు. రూ. 3 కోట్ల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ దేశంలో నంబర్ వన్ అని.. ధరణి రద్దు చేసి ఏం చేస్తారో కాంగ్రెస్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఎవరికి పిండం పెట్టాలో ప్రజలే చెప్తారని.. ధరణి తీస్తాం అనే వారికి ఇంకితం ఉండాలని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar).. బీఆర్ఎస్‌ను బీజేపీకి (BJP) బీ టీమ్ అన్నారని.. సీన్ కట్ చేస్తే ఆయనే వెళ్లి బీజేపీలో జొర్రిండు అని బాస్ చెప్పుకొచ్చారు. మైనార్టీ హక్కుల కోసం కొట్లాడే ఎంఐఎంను బి టీమ్ అంటున్నారని.. మజ్లీస్- బీఆర్ఎస్ (AIMIM-BRS) ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లో కూడా ఫ్రెండ్లీ పార్టీలుగానే ఉంటామని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు.

brs.jpg


ఇవి కూడా చదవండి


Gaddar Passes Away : గద్దర్‌కు గుండె ఆపరేషన్ సక్సెస్ అయినా ఎలా చనిపోయారు..!?



TSRTC Merger Bill : ఆర్టీసీ విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం



Updated Date - 2023-08-06T18:46:51+05:30 IST