Share News

Chicken biryani: ఆ.. చికెన్‌ బిర్యానీ.. హానికరమే..!

ABN , First Publish Date - 2023-10-21T08:51:41+05:30 IST

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌(Secunderabad Railway Station)లోని 8,9ఫ్లాట్‌ఫారాలపై ఉన్న ఒక స్టాల్‌లోని చికెన్‌

Chicken biryani: ఆ.. చికెన్‌ బిర్యానీ.. హానికరమే..!

- నాగరాణి కేటరర్స్‌కు రూ.50వేల జరిమానా

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌(Secunderabad Railway Station)లోని 8,9ఫ్లాట్‌ఫారాలపై ఉన్న ఒక స్టాల్‌లోని చికెన్‌ బిర్యానీ(Chicken biryani) హానికరమైనదిగా తేలిందని దక్షిణమధ్యరైల్వే కమర్షియల్‌ మేనేజర్‌ బి.సునీత(B. Sunita) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది మే 2న ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి, చికెన్‌ బిర్యానీ శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం నాచారంలోని సీపీఏకు పంపారు. నాగరాణి కేటరర్స్‌ నిర్వహిస్తున్న స్టాల్‌లో సేకరించిన చికెన్‌ బిర్యాని హానికరమైనదని తేలింది. అక్కడి చికెన్‌ బిర్యానీలో హానికరమైన సింథటిక్‌ ఫుడ్‌ కలర్‌ను సీపీఏ అధికారులు గుర్తించి నివేదిక అందజేశారు. ఈ నివేదికను పరిశీలించిన మీదట ఫుడ్‌సేఫ్టీ యాక్ట్‌ 2006 ప్రకారం బాధ్యులైన నాగరాణి కేటరర్స్‌కు రూ.50వేల జరిమానా విధించినట్లు రైల్వే కమర్షియల్‌ మేనేజర్‌ సునీత స్పష్టం చేశారు.

Updated Date - 2023-10-21T08:51:41+05:30 IST