Share News

Telangana Elections: నేడు రేవంత్‌ రెడ్డి ఎక్కడెక్కడ ప్రచారం చేయనున్నారంటే?...

ABN , First Publish Date - 2023-11-23T09:24:55+05:30 IST

Revanth Reddy: తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుసాగుతోంది. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ప్రతీ రోజు నాలుగైదు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం, రోడ్ షోలతో దూసుకెళ్తున్నారు.

Telangana Elections: నేడు రేవంత్‌ రెడ్డి ఎక్కడెక్కడ ప్రచారం చేయనున్నారంటే?...

హైదరాబాద్: తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress) ముందుసాగుతోంది. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ప్రతీ రోజు నాలుగైదు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం, రోడ్ షోలతో దూసుకెళ్తున్నారు. ఈరోజు(గురువారం) ఆరు నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దుబ్బాక, హుజూరాబాద్, మానకొండూర్, మహేశ్వరం, ఎల్బీనగర్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో సభల్లో రేవంత్ పాల్గొననున్నారు.


రేవంత్ ప్రచార వివరాలు:

  • ఉదయం 11 గంటలకు దుబ్బాక బహిరంగ సభ

  • మధ్యాహ్నం 12:30 గంటలకు హుజూరాబాద్ బహిరంగ సభ

  • మధ్యాహ్నం 2 గంటలకు మానకొండూర్ బహిరంగ సభ

  • మధ్యాహ్నం 3 గంటలకు మహేశ్వరం కార్నర్ మీటింగ్

  • సాయంత్రం 4 గంటలకు ఎల్బీ నగర్ కార్నర్ మీటింగ్

  • సాయంత్రం 5 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్‌లలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-23T09:53:31+05:30 IST