Share News

BRS - Congress: నారాయణపేట జిల్లాలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల రాళ్లదాడిి

ABN , First Publish Date - 2023-11-14T21:10:45+05:30 IST

నారాయణపేట జిల్లాలోని కోస్గి మండలం సర్జఖాన్‌పేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

 BRS - Congress: నారాయణపేట జిల్లాలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల రాళ్లదాడిి

నారాయణపేట: నారాయణపేట జిల్లాలోని కోస్గి మండలం సర్జఖాన్‌పేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.BRS నేతల వాహనాలపై కాంగ్రెస్ నేతలు రాళ్లు రువ్వారు. BRS నేతల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు.బాబా ఫసియుద్దీన్ నేతృత్వంలో BRS నేతలు ప్రచారం చేస్తున్నారు.కోస్గిలో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో BRS కార్యకర్తల ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు.ఇరువర్గాలు పరస్పరం మరోసారి దాడి చేసుకున్నాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

Updated Date - 2023-11-14T21:31:31+05:30 IST