Share News

Telangana Result Updates : ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్.. క్యూ కడుతున్నారుగా..!

ABN , First Publish Date - Dec 03 , 2023 | 06:38 AM

Telangana Election Results : తెలంగాణ హస్త ‘గతం’ అయ్యింది.. కౌంటింగ్ ప్రారంభమైన 8 గంటల సమయం నుంచి ఇప్పటి వరకూ ఏం జరిగిందనే ఆసక్తికర విషయాలు ఇక్కడ చూడొచ్చు..

Telangana Result Updates : ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్.. క్యూ కడుతున్నారుగా..!

Live News & Update

  • 2023-12-03T21:00:00+05:30

    గవర్నర్‌తో భేటీ కానున్న వికాస్‌రాజ్‌! (10:00 PM)

    • సోమవారం ఉదయం గవర్నర్‌ తమిళిసైను కలవనున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌

    • శాసనసభ ఎన్నికలపై గర్నవర్‌కు నివేదిక అందజేయనున్న ఈసీ

    • కొత్త శాసనసభ ఏర్పాటు చేస్తూ సోమవారం నోటిఫికేషన్‌ జారీ

    Vikasraj.jpg

    ఇదిగో మేడమ్.. వీళ్లే మా వాళ్లు! (09:55 PM)

    • గవర్నర్‌తో ముగిసిన కాంగ్రెస్ నేతల భేటీ

    • ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని గవర్నర్‌కు తెలిపిన కాంగ్రెస్ నేతల బృందం

    • గెలిచిన అభ్యర్థుల జాబితాను గవర్నర్‌కు అందించిన కాంగ్రెస్ నేతలు

    • గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. ముఖ్య నేతలు డీకే శివకుమార్‌, మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మల్లు రవి తదితరులు

    Revanth-Mets-Gov.jpg

    భేటీ అవుతున్నాం..! (09:52 PM)

    • సోమవారం నాడు గెలిచిన అభ్యర్థులతో సమావేశం అవుతాం

    • ఉదయం 9.30 గంటలకు అభ్యర్థులతో భేటీ -డీకే శివకుమార్‌

    • సోమవారం ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం

    • గవర్నమెంట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని గవర్నర్‌కు చెప్పాం..

    • కాంగ్రెస్‌కు 65 మంది సభ్యులున్నారని వెల్లడించాం : డీకే శివకుమార్‌

    DK.jpg

    09:20 PM : అబ్బే అదేం లేదే..!

    • రేవంత్ రెడ్డే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ప్రచారం

    • సీఎం అభ్యర్థిపై ఏఐసీసీలో నిర్ణయం జరగలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

    • ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాత అధిష్ఠానం నిర్ణయం

    • మీడియాలో వస్తున్నట్లు ఎలాంటి నిర్ణయం జరగలేదు

    • సీఎం ఎవరనేది ఫైనల్‌ కాలేదు.. నా అభిప్రాయం బయట చెప్పను : ఉత్తమ్‌

    MP-Uttam-Kumar-Reddy-2.jpg

    మేడమ్.. మేం రెఢీ!!

    • గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతల బృందం

    • గవర్నర్‌ తమిళిసైని కలిసిన కాంగ్రెస్‌ నేతల బృందం

    • ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ అందజేత

    governor-tamili-si.jpg

  • 2023-12-03T20:05:00+05:30

    08:25 PM : కొత్త బాస్ వచ్చేశారు!

    • తెలంగాణ కొత్త డీజీపీగా రవిగుప్తా నియామకం

    • డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్‌ చేయడంతో కొత్త డీజీపీని నియమించిన ఈసీ

    • ఇదివరకు డీజీపీ రేసులో ఉన్న రవిగుప్తా..!

    • హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించిన అనుభవం

    • ఇప్పటి వరకూ డీజీపీగా ఉన్న అంజనీకుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు

    • ఎన్నికల నిబంధనలు ఉల్లఘించారని ఉత్తర్వుల్లో పేర్కొన్న ఈసీ

    • టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్పి సస్పెండ్ వేటుకు గురైన డీజీపీ

    • అంజనీకుమార్ తర్వాత సీనియర్ అధికారిగా రవిగుప్తా ఉండటంతో బాధ్యతలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు

    New-DGP-Guptha.jpg

    స్వాగతిస్తున్నా..!

    • సంగారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి జగ్గారెడ్డి ఓటమి

    • సంగారెడ్డి ప్రజల తీర్పుని స్వాగతిస్తున్నాను

    • సంగారెడ్డి ప్రజలు నాకు ఐదేళ్లు విశ్రాంతి ఇచ్చారు

    • నాకు ఓట్లు వేసిన 65 వేల మందికి.. అలాగే నాకు ఓట్లు వేయని 71 వేల మందికి కృతజ్ఞతలు

    • సంగారెడ్డి ప్రజలు నాకు కౌన్సిలర్‌గా, మున్సిపల్ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు

    • 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలిపించి అవకాశం ఇచ్చారు

    • 2018 లో ఎమ్మెల్యేగా మళ్లీ గెలిపించారు.. ఇప్పుడు ఓడించారు

    • మీ (నియోజకవర్గ ప్రజలు) తీర్పుని గౌరవిస్తున్నా.. నా రాజకీయం గురించి ఇప్పుడే చెప్పను.. ఇంకో 4 ఏళ్ల తర్వాత చెబుతాను

    Jaggareddy.jpg

  • 2023-12-03T19:00:00+05:30

    సార్ రాజీనామాకు మేడమ్ ఆమోదం!

    • ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా

    • రాజీనామాను ఆమోదించిన గవర్నర్‌ తమిళిసై

    • అధికారికంగా ప్రకటించిన రాజ్‌భవన్ వర్గాలు

    • కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని తమిళిసై సూచించినట్టు సమాచారం

    Kcr-Resign-Letter.jpg

    శిరసావహిస్తాం.. ఫలితాలపై కేటీఆర్ కీలక ప్రకటన

    • పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు

    • ఫలితాలు చూసి నేను షాకయ్యాను

    • ఆశించిన ఫలితం రాలేదు.. ఓటమికి కారణాలను సమీక్షించుకుంటాం

    • 119 సీట్లకు గాను 39 సీట్లు ఇచ్చి.. 39 స్థానాలతో ప్రతిపక్ష పాత్రను పోషించాలని ప్రజలు చెప్పారు

    • ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తాం

    • ప్రజలు అందించిన తీర్పును శిరసావహిస్తాం

    • బీఆర్ఎస్ పార్టీ అనేక ఎత్తుపల్లాలను చవిచూశాం

    • అనుకున్న తెలంగాణను సాధించాం

    • 39 సీట్లు కార్యకర్తల శ్రమతోనే వచ్చాయి

    • ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా పని చేస్తాం

    • ప్రభుత్వం నడిపేవారు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటం చేస్తున్నాం

    • పదేళ్లు ప్రభుత్వాన్ని అప్పగిస్తే సమర్థంగా నడిపాం.. ఎన్నో సేవలందించాం

    • ఈ ఎదురు దెబ్బను పాఠంగా నేర్చుకొని ముందుకు సాగుతాం

    • 23 ఏళ్లలో అనేక ఎత్తుపల్లాలు చూశాం. ప్రజల దయతో పదేళ్లు అధికారంలో ఉన్నాం

    • రాజకీయాల్లో సహనం అవసరం.. గెలుపు, ఓటములు సహజం

    • గెలిచిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు.. కొత్త ప్రభుత్వానికి సమయం ఇస్తాం

    • బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడవద్దు

    • హైదరాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడింది

    • ఈ ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే

    • కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసి పూర్వ వైభవం సాదిద్దాం

    • మేం చేసిన పనిపట్ల సంతృప్తి ఉంది. ఓడిపోయామన్న బాధ, అసంతృప్తి లేదు

    • రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణం

    • గతంలో చేసిన దానికంటే రెట్టింపు కష్టం చేస్తాం.. ఎవరూ నిరాశకు గురికావొద్దు..

    • కొత్త ప్రభుత్వాన్ని తొందరపెట్టం.. వాళ్లు కుదురుకోవాలి

    KTR Shock With Results.jpg

  • 2023-12-03T18:05:00+05:30

    సీఎం ఎవరనేదానిపై క్లారిటీ వచ్చేసింది..!

    • తెలంగాణ సీఎంగా రేపు (డిసెంబర్-04) రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం..?

    • డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం..?

    • రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ తమిళిసై

    • హాజరుకానున్న రాహుల్‌ గాంధీ

    • సాయంత్రం ఎల్లా హోటల్‌లో సీఎల్పీ సమావేశం

    • సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎన్నుకోనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

    • ఈ నెల 9న కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం

    • పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు

    • సోనియా, రాహుల్‌, ప్రియాంక, ఖర్గే సహా హాజరుకానున్న కీలక నేతలు

    Revanth CM.jpg

    ఏపీలో సంబరాలు..!

    • పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో రేవంత్ రెడ్డి వియ్యంకుడు వెంకట్ రెడ్డి ఇంటి వద్ద సంబరాలు

    • తెలంగాణలో కాంగ్రెస్ విజయంతో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచిన బంధువులు, హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులు

    • రేవంత్ రెడ్డి వియ్యంకుడు రెడ్డి, రెడ్డి మోటార్స్ అధినేత వెంకటరెడ్డి

    ఏం చేద్దాం.. ఎలా ముందుకెళ్దాం..!

    • ఈ రోజు రాత్రి 8 గంటలకు సీఎల్పీ సమావేశం

    • సోమవారం గవర్నర్‌ తమిళిసైను కలవనున్న కాంగ్రెస్‌ ప్రతినిధులు

    • హోటల్‌ ఎల్లాకు చేరుకుంటున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

    • ఇప్పటికే హోటల్‌లో ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌, మరో నలుగురు పరిశీలకులు

    1dk0107A.jpg

    రీకౌంటింగ్‌ చేయాల్సిందే..!

    • కరీంనగర్ అసెంబ్లీ ఫలితంపై హైడ్రామా

    • బండి సంజయ్‌పై 326 ఓట్ల తేడాతో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్

    • కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని రీకౌంటింగ్ కోరిన బండి సంజయ్

    • ఫలితాన్ని అధికారికంగా ప్రకటించని అధికారులు

    • ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అప్పీల్ చేసిన సంజయ్

    bandi-gangula.jpg

  • 2023-12-03T17:33:00+05:30

    ఫలితాల తర్వాత పెను సంచలనం!

    • డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్‌ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్

    • ఎన్నికల ఫలితాలు పూర్తికాకముందే..

    • రేవంత్‌రెడ్డిని కలవడంతో ఈసీ చర్యలు

    • ఉదయం మర్యాదపూర్వకంగా రేవంత్‌ ఇంటికివెళ్లిన డీజీపీ

    • ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద సస్పెన్షన్‌ వేటు

    • హాట్ టాపిక్‌గా మారిన రేవంత్‌తో కలయిక.. సస్పెన్షన్!

    DGP.jpg

  • 2023-12-03T17:20:00+05:30

    రేపే ప్రమాణ స్వీకారం!

    • కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు

    • సోమవారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం

    • హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం వేదికగా కార్యక్రమం

    • రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారంటున్న పార్టీ శ్రేణులు, వీరాభిమానులు

    • ఇప్పటికే హైకమాండ్ నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు వచ్చాయని టాక్

    • సీఎం అభ్యర్థి ఎవరనేది తేలిపోయిందంటున్న రేవంత్ అనుచరులు

    • రేవంత్ సీఎం అభ్యర్థి ప్రకటనకు ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ చక్రం తిప్పినట్లు టాక్

    • ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇప్పటికే తాజ్‌ కృష్ణకు చేరిన పరిస్థితి

    • ఈ రోజు రాత్రి సీఎల్పీ సమావేశం

    Revanth-Sitting.jpg

  • 2023-12-03T17:05:00+05:30

    వరంగల్‌లో హస్తం విజయదుందుభి!

    • ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఘన విజయం

    • 2 నియోజకవర్గాలకే పరిమితం అయిన బీఆర్ఎస్!

    • వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ కొండా సురేఖ విజయం

    • వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయిని రాజేందర్ రెడ్డి విజయం

    • భూపాలపల్లి లో కాంగ్రెస్ గండ్ర సత్యనారాయణ రావు విజయం

    • పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ రేవూరి ప్రకాష్ రెడ్డి విజయం

    • ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఘన విజయం

    • నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ దొంతి మాధవరెడ్డి విజయం

    • డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రాంచంధర్ నాయక్ విజయం

    • మహబూబాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మురళీ నాయక్ విజయం

    • పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ యశస్విని రెడ్డి విజయం

    • వర్దన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ KR నాగరాజు విజయం

    • స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి విజయం

    • జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు

    • పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి

  • 2023-12-03T16:42:00+05:30

    సారు రాజీనామా!

    • సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్‌

    • రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైకి రాజీనామా పత్రం అందజేసిన కేసీఆర్

    kcr-gov.jpg

    కాంగ్రెస్ విజయం వారికే అంకితం : రేవంత్‌రెడ్డి

    • ఈ విజయం తెలంగాణ అమరులకు అంకితం

    • డిసెంబర్‌-03న శ్రీకాంతాచారి అమరుడయ్యారు

    • ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రజలు కాంగ్రెస్‌కు గెలిపించారు

    • తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ బాధ్యతను పెంచారు

    • ఈ విజయంలో 30 లక్షల మంది నిరుద్యోగుల పట్టుదల ఉంది

  • 2023-12-03T16:30:00+05:30

    ఇద్దరు సీఎం అభ్యర్థులపై గెలుపు!

    • కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి రమణారెడ్డి గెలుపు

    • ఇద్దరు సీఎం అభ్యర్థులు.. కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించిన రమణారెడ్డి

    • అయితే రేవంత్ లేదా కేసీఆర్ గెలుస్తారని భావించిన ఆయా పార్టీ శ్రేణులు

    • ఊహించని ఫలితం ఇచ్చిన కామారెడ్డి ఓటర్లు

    • బీజేపీ అభ్యర్థికి పండిన ‘లోకల్’ సెంటిమెంట్!

    Kamareddy-Cand.jpg

  • 2023-12-03T16:13:00+05:30

    అవును.. పేరు మార్చేస్తాం : రేవంత్ రెడ్డి

    • కొత్త ప్రభుత్వ ఏర్పాటులో బీఆర్ఎస్‌ సహకరిస్తుందని ఆశిస్తున్నాం

    • సచివాలయం గేట్లు అందరికి తెరుచుకుంటాయి

    • ప్రగతి భవన్‌.. డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్‌ భవన్‌గా మారుతుంది.. ప్రగతి భవన్‌ కాదు.. ఇకపై అది ప్రజా భవన్‌..

    • ఏ సమస్యలు వచ్చినా నైతికంగా అండగా ఉన్న రాహుల్‌ గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు

    • భారత్‌ జోడో యాత్ర ద్వారా రాహుల్‌ స్ఫూర్తి నింపారు

    • నేను, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిసి పార్టీని ముందుకు నడిపించాం

    • సీనియర్‌ నాయకులందరి సహకారంతో కాంగ్రెస్‌ విజయం సాధించింది

    • మానవ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్‌ ముందు ఉంటుంది

    • ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తాం

    • సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌లతో కలిసి ముందుకు వెళ్తాం : రేవంత్ రెడ్డి

    Revanth.jpg

  • 2023-12-03T15:56:10+05:30

    సీఎం పదవిపై స్పందించిన భట్టి విక్రమార్క.. సీఎం పదవి ఇస్తే..

    తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం దాదాపు ఖరారైన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, మధిర నియోజకవర్గం నుంచి గెలుపొందిన భట్టి విక్రమార్క ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే బాధ్యతగా స్వీకరిస్తానని అన్నారు. తెలంగాణలో దొరల పాలన పోయి ప్రజల తెలంగాణ పాలన వచ్చిందని అన్నారు.

    ప్రజలకు ఇచ్చి హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ పూర్తయ్యిన తర్వాత ఎమ్మెల్యేలంతా ఒక్కచోట చేరతామని, ఎమ్మెల్యేలంతా సీఎల్పీ లీడర్‌గా కొనసాగమంటే కొనసాగుతానని చెప్పారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    Untitled-18.jpg

  • 2023-12-03T15:48:57+05:30

    విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రేవంత్ ట్వీట్

    ‘‘ ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్‌ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కొన ఊపిరి వరకు కొడంగల్ నియోజకవర్గమే శ్వాసగా జీవిస్తాను. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్‌ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుంటా. ఈ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యతను తీసుకుంటా. దేశానికి కొడంగల్‌ను ఒక మోడల్‌గా నిలబెడతా’’ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

  • 2023-12-03T15:23:42+05:30

    ఎన్నికల ఫలితాలపై తొలిసారి స్పందించిన కేటీఆర్

    తెలంగాణ ఎన్నికలు 2023లో కాంగ్రెస్ పార్టీ విజయం దాదాపు ఖాయమవ్వడంతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘ఎక్స్’ వేదికగా ‘‘బీఆర్ఎస్ పార్టీకి వరుసగా రెండు పర్యాయాలు అధికారం అప్పగించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. ఈ రోజు (ఆదివారం) ఫలితం గురించి బాధలేదు. అయితే మేము ఆశించి రీతిలో ఫలితాలు రాకపోవడంతో కచ్చితంగా నిరాశ కలిగించింది. కానీ ఈ ఫలితాన్ని ఒక పాఠంగా తీసుకొని తిరిగి పుంజుకుంటాం. ప్రజా ఆమోదం పొందిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. శుభం జరగాలని ఆశిస్తున్నాను’’ అని స్పందించారు.

  • 2023-12-03T13:59:38+05:30

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

    1. కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి కోణంనేని సాంబశివరావు 22,169 ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    2. ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య 50 వేల పైచిలుకు మెజారిటీ సాధించారు.

    3. పినపాక నియోజకవర్గం పాయం వెంకటేశ్వర్లుకు 27 వేల పైచిలుకు మెజారిటీ.

    4. అశ్వారావుపేట నియోజకవర్గ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జారీ ఆదినారాయణ కు 28 వేల పైచిలుకు మెజారిటీ

    5. భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావుకు 5000 పైచిలుకు మెజారిటీ లభించింది.

  • 2023-12-03T13:50:39+05:30

    ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఉన్న నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఓటమి

    పైలట్ రోహిత్ రెడ్డి.

    బీరం హర్షవర్ధన్ రెడ్డి.

    రేగా కాంతారావు,

    గువ్వల బాలరాజు

  • 2023-12-03T13:40:20+05:30

    మధిరలో 35 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క ఘన విజయం

  • 2023-12-03T13:30:12+05:30

    కాంగ్రెస్‌ను వీడిన ఎమ్మెల్యేల్లో 9 మంది ఓటమి

  • 2023-12-03T13:25:12+05:30

    ఇప్పటి వరకూ ఎవరెవరు గెలిచారంటే..

    1.ఆశ్వరావుపేటలో కాంగ్రెస్ విజయం

    2. ఇల్లందులో కాంగ్రెస్ విజయం

    3. రామగుండం లో కాంగ్రెస్ విజయం

    4.చార్మినార్ MIM విజయం

    5.అంబర్ పేటలో BRS విజయం

    6.జుక్కల్ కాంగ్రెస్ విజయం

    7.దుబ్బాక BRS విజయం

    8. ఆందోల్ లో కాంగ్రెస్ విజయం

    9.నల్గొండ కాంగ్రెస్ విజయం

    10. బెల్లంపల్లి కాంగ్రెస్ విజయం

    11.నారాయణపేట కాంగ్రెస్ విజయం

    12.కొడంగల్ కాంగ్రెస్ విజయం

    13. చంద్రయాన్ గుట్ట MIM విజయం

    14.పాలకుర్తి కాంగ్రెస్ విజయం

    15. వేములాడలో కాంగ్రెస్ విజయం

    16. మునుగోడు కాంగ్రెస్ విజయం

    17.బాల్కొండ BRS విజయం

    18. సికింద్రాబాద్ BRS విజయం

    19.సిద్దిపేట BRS విజయం

    20.ఆర్మూర్ బీజేపీ విజయం

    21.నిర్మల్ బీజేపీ విజయం

    22.హుజూర్ నగర్ కాంగ్రెస్ విజయం

    23. భద్రాచలం BRS విజయం

    24.సిరిసిల్ల BRS విజయం

    25. భాన్స్ వాడ BRS విజయం

    26.హుజూరాబాద్ BRS విజయం

    27.ములుగు కాంగ్రెస్ విజయం

    28.ముషీరాబాద్ BRS విజయం

    29.నకిరేకల్ కాంగ్రెస్ విజయం

    30.మేడ్చల్ BRS విజయం

    31. నాగార్జున సాగర్ కాంగ్రెస్ విజయం

    32.మంథని కాంగ్రెస్ విజయం

    33.సనత్ నగర్ BRS విజయం

    34.చెన్నూర్ కాంగ్రెస్ విజయం

  • 2023-12-03T13:23:30+05:30

    దుబ్బాకలో రఘునందర్ రావు ఓటమి

    దుబ్బాకలో బీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు.

    కిషన్ రెడ్డికి షాక్

    తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం అంబర్‌పేటలో బీజేపీ అభ్యర్థి కృష్ణాయాదవ్ ఓటమిపాలయ్యారు. దీంతో కిషన్ రెడ్డి షాక్‌కు గురయ్యారు. ఈ ఎన్నికల్లో పోటీకి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. అంబర్‌పేట బీజేపీ అభ్యర్థిగా కృష్ణయాదవ్‌కు అవకాశం ఇచ్చారు. ఆయనను గెలిపించే బాధ్యతను బీజేపీ నాయకత్వం కిషన్ రెడ్డికి అప్పగించింది. కృష్ణాయాదవ్‌ను గెలిపించుకోవటంలో కిషన్ రెడ్డి విఫలమయ్యారు.

  • 2023-12-03T13:15:06+05:30

    ఓడిన మంత్రులు.. ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్

  • 2023-12-03T12:55:38+05:30

    కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీ కుమార్ వెళ్లారు. పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

    Untitled-12.jpg

  • 2023-12-03T12:49:25+05:30

    తెలంగాణ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న తరుణంలో.. ముఖ్యమంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం అభ్యర్థిపై ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని.. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడం వల్ల డీజీపీ ఆయన్ను కలిశారని అన్నారు. ఈ విజయాన్ని తాము సోనియా గాంధీకి పుట్టినరోజు కానుకగా ఇస్తున్నామని పేర్కొన్నారు.

  • 2023-12-03T12:39:31+05:30

    • బీఆర్ఎస్ ఖాతాలో తొలి పడింది. భద్రాచలంలో ఆ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్ విజయం సాధించారు.

    • జనసేన పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గత్లంతు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఘోరంగా ఓటమి పాలైన అభ్యర్థులు.

    • రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సీఐడీ చీఫ్ మహేష్ భగవత్

  • 2023-12-03T12:25:11+05:30

    • కొడంగల్‌లో 13వ రౌండ్ ముగింపు సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి 69,810 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.

    • తొమ్మిదవ రౌండ్ ముగిసేసరికి భువనగిరిలో 10,468 అధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి

    • పదో రౌండ్ ముగిసేసరికి ఆలేరులో 17,638 అధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య

    • చెన్నూరు సెగ్మెంట్‌లో 9వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ 19,901 లీడ్‌లో ఉంది.

    • బెల్లంపల్లి నియోజకవర్గంలో 9వ రౌండ్ ముగిసే వరకు కాంగ్రెస్ 24,931 లీడ్‌లో ఉంది.

    • సూర్యాపేట స్థానంలో 7వ రౌండ్ ముగిసే సరికి మంత్రి జగదీష్ రెడ్డి ఆధిక్యం. కాంగ్రెస్ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్ రెడ్డిపై 4172 ఓట్ల ఆధిక్యంలో జగదీష్ రెడ్డి...

    • అదిలాబాద్ 11వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి 5965 లీడ్..

  • 2023-12-03T12:16:42+05:30

    • కాంగ్రెస్ ఖాతాలో ముచ్చటగా మూడో విజయం ఖరారైంది. రామగుండంలో హస్తం పార్టీ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్

    • చార్మినార్‌లో ఎంఐఎం పార్టీ విజయం సాధించింది.

  • 2023-12-03T12:05:18+05:30

    • తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. మధ్యాహ్నం 12 గంటల సమాయానికి కాంగ్రెస్ 71 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీఆర్ఎస్ 33, బీజేపీ 9, ఎంఐఎం 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

    • మునుగోడులో 7 రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ మెజారిటీ 8796 ఓట్లు.

    • పరిగిలో ఆరవ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ ఆధిక్యం 6,826

    • ధర్మపురి నియోజక వర్గం 6వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ 7164 ఆధిక్యంలో ఉంది.

    • జనగామ- 5వ రౌండ్ ముగిసే సరికి 7340 ఓట్ల ఆధిక్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి

    • అసిఫాబాద్ సెగ్మెంట్ 7వ రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి కోవలక్ష్మి కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్ నాయక్‌పై మొత్తం 8530 ఓట్లు ఆధిక్యత సాధించారు.

    • కొడంగల్‌లో 11వ రౌండ్ ముగిసే సరికి రేవంత్ రెడ్డి ఆధిక్యం 58561 ఓట్లుగా ఉంది.

    • కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ 5,411 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది.

    • బెల్లంపల్లి సెగ్మెంట్‌లో 8వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ 22,613 లీడ్...

    • తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి సామేల్ 6 రౌండ్ ముగిసే సరికి 17 వేల ఆధిక్యం

    • వనపర్తిలో తొమ్మిదవ రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి మంత్రి నిరంజన్ రెడ్డిప 7148 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు.

    • వికారాబాద్‌లో 997 ఓట్ల లీడ్‌లో కాంగ్రెస్ పార్టీ

    • ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో తొమ్మిదో రెండు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య తన సమీప ప్రత్యర్థి ప్రస్తుతం ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పై 15,191 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు

    • గోషామహల్ 9వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ రాజాసింగ్ 12 వేల ఓట్ల లీడ్

  • 2023-12-03T11:55:21+05:30

    కాంగ్రెస్ ఖాతాలో రెండో విజయం చేరింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు నియోజకర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య గెలుపొందారు.

    Untitled-11.jpg

  • 2023-12-03T11:45:07+05:30

    • బెల్లంపల్లి 6వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ 15,819 లీడ్

    • భూపాలపల్లి నియోజకవర్గం : రౌండ్ నెంబర్ - 4 BRS - 11718, CONG - 21003, BJP - 2258 LEAD - 9285 (కాంగ్రెస్)

    • ఏడో రౌండ్ ముగిసే సరికి వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి కి 4556 ఓట్లతో మంత్రి నిరంజన్ రెడ్డిపై లీడ్

    • దుబ్బాక 7th round ముగిసే సరికి BRS - 4895, CONGRESS - 809, Bjp - 2907, NOTA - 116, BRS మొత్తం ఆధిక్యం -22,787

    • అదిలాబాదులో తొమ్మిదవ రౌండ్ ముగిసేసరికి 4400 బీజేపీకి అభ్యర్థి లీడ్...

    • తాండూరు 6వ రౌండ్‌లో కాంగ్రెస్ కాంగ్రెస్ 422 ఆధిక్యం

    • ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట మినహా 11 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యం

  • 2023-12-03T11:33:32+05:30

    కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం పడింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో 23,358 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి జరే ఆదినారాయణ గెలుపొందారు.

    Untitled-9.jpg

  • 2023-12-03T11:18:55+05:30

    • ములుగులో 7 రౌండ్లు పూర్తయ్యే సరికి 10,080 లీడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క

    • బోథ్‌లో నాలుగవ రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థికి 4703 ఓట్ల లీడ్ ..

    • కొడంగల్‌లో 8వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి 40,854 ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    • మంచిర్యాల సెగ్మెంట్‌లో 3వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ 6932 లీడ్..

    • భువనగిరి నియోజకవర్గం ఆరవ రౌండ్ ముగిసే ముగిసేసరికి కాంగ్రెస్ 5900 అధిక్యం...

    • పెద్దపల్లి నియోజకవర్గంలో 5వ రౌండ్ పూర్తయ్యేసరికి 11,791 ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు

    • నకిరేకల్ 5వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వీరేశంకు 2456 ఆధిక్యం

    • గజ్వేల్ 3వ రౌండ్‌లో బీఆర్ఎస్- 4782, బీజేపీ- 3569, కాంగ్రెస్- 1627 దీంతో కేసీఆర్ మొత్తం లీడ్ 3020గా ఉంది.

  • 2023-12-03T11:13:49+05:30

    భద్రాచలంలో 302 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్

  • 2023-12-03T11:07:11+05:30

    వెనుకంజలో నలుగురు మంత్రులు.. ఎవరెవరంటే..?

    ప్రస్తుతం అందుతున్న ట్రెండ్స్‌ను బట్టి చూస్తే రాష్ట్రంవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోంది. అధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అయితే నలుగురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్ రావు వారి వారి స్థానాల్లో వెనుకబడ్డారు.

  • 2023-12-03T10:57:13+05:30

    వనపర్తి మొదటి రౌండ్ బీఆర్ఎస్ లీడ్ -717

    వనపర్తి రెండో రౌండ్ కాంగ్రెస్ లీడ్ 94 లీడ్

    మూడో రౌండ్ కాంగ్రెస్ లీడ్ 21, నాలుగో రౌండ్ కాంగ్రెస్ 421 లీడ్

    మొత్తంగా బీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి 181 ఓట్లతో లీడ్‌లో ఉన్నారు.

    Congress.jpg

  • 2023-12-03T10:54:19+05:30

    • మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం

    • కొత్తగూడెంలో సీపీఐ లీడ్

    • అశ్వారావుపేటలో కాంగ్రెస్ ఆధిక్యం

  • 2023-12-03T10:45:00+05:30

    కారొద్దు.. కాంగ్రెస్సే ముద్దు!

    • కాంగ్రెస్ గెలుపుతో క్యూ కడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

    • రేవంత్‌ను కలిసిన భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

    • పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడిగా తెల్లం గుర్తింపు

    • ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. గులాబీ గూటికి..

    • కారెక్కిన రోజుల వ్యవధిలోనే టికెట్ కేటాయించిన కేసీఆర్

    • బీఆర్ఎస్ తరఫున గెలిచి తిరిగి కాంగ్రెస్‌లోకి వెంకట్రావు

    • మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రేవంత్‌కు టచ్‌లో ఉన్నట్లు సమాచారం

    • ఆ ముగ్గురు రేవంత్ టీడీపీలో ఉన్నప్పుడు కలిసి పనిచేశారని టాక్

    • కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరి గెలిచిన ఓ ఎమ్మెల్యే కూడా తిరిగొస్తారని ప్రచారం

    Tellam.jpg

  • 2023-12-03T10:15:17+05:30

    • ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఆధిక్యం

    • ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 స్థానాల్లో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. వరంగల్ తూర్పు, పశ్చిమ, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, ములుగు, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండగా స్టేషన్ ఘనపూర్, జనగామలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థుల ముందంజలో ఉన్నారు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెనుకబడ్డారు.

    • వరంగల్ తూర్పులో మూడవ స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్

    • వెనుకంజలో మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్

    • ముందంజలో కొనసాగుతున్న సీతక్క, కొండా సురేఖ

    • ముందంజలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి

    • గట్టిపోటీని ఎదుర్కొంటున్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

    • ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న కాంగ్రెస్ ఆధిక్యం

    • 10 స్థానాల్లో కాంగ్రెస్, 02స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ముందంజ

    • వరంగల్ తూర్పు, పశ్చిమ, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, ములుగు, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజ

    • స్టేషన్ ఘనపూర్, జనగామలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థుల ముందంజ

    • పాలకుర్తిలో వెనుకబడ్డ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

    • వరంగల్ తూర్పులో మూడవ స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్

    • వెనుకంజలో మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్

    • ముందంజలో కొనసాగుతున్న సీతక్క, కొండా సురేఖ

    • ముందంజలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి

    • గట్టిపోటీని ఎదుర్కొంటున్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

  • 2023-12-03T10:15:00+05:30

    అంతా ఉత్తిదే..!

    • సోమవారం కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం మాత్రమే ఉందన్న హైకమాండ్

    • ప్రమాణ స్వీకారం అంటూ వైరల్ అవుతున్న లెటర్ ఫేక్ అని తేల్చిన కాంగ్రెస్

    • రేవంత్ రెడ్డి సోమవారం నాడే ప్రమాణ స్వీకారం చేస్తారని సాగిన ప్రచారం

    • ఫరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు గుప్పుమన్న వార్తలు

    • సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతో కూడిన జాబితా వైరల్‌గా మారిన పరిస్థితి

    • సీన్ కట్ చేస్తే అంతా ఉత్తిదే అని తేల్చిన కాంగ్రెస్ హైకమాండ్

    • ఈ వరుస వార్తలు, హైకమాండ్ నిర్ణయంతో అసలేం జరుగుతోందో తెలియక క్యాడర్‌లో ఆందోళన

    • సీఎం అభ్యర్థిగా ఎవరిని నియమిస్తారని ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజానీకం

    • ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ సీఎం కావాల్సిందేనని కోరుకుంటున్న పార్టీ శ్రేణులు, వీరాభిమానులు, అనుచరులు

    Congress-Letter.jpgRevanth-Latest.jpg

  • 2023-12-03T10:06:13+05:30

    Telangana Election 2023 LIVE Updates: కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మూడో రౌండ్ ముగిసే సమయానికి సీఎం కేసీఆర్ వెనుకబడ్డారు.

  • 2023-12-03T09:54:05+05:30

    • స్టేషన్ ఘన్ పూర్‌లో బీఆర్ఎస్ - 4915, కాంగ్రెస్- 3959, బీజేపీ- 198. మొదటి రౌండ్‌లో బీఆర్ఎస్‌కు 956 ఓట్ల ఆధిక్యం

    • భువనగిరి నియోజకవర్గంలో మూడు రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం.

    • రామగుండం నియోజకవర్గం- 2వ రౌండ్‌లో కాంగ్రెస్ 5591, BSP 38, BRS 1763, BJP 749, Lead 3828

    • చేవెళ్ల మొదటి రౌండ్‌లో బీఆర్ఎస్..3368.. కాంగ్రెస్ అభ్యర్థి 2858.., బిజెపి1801.. బీఆర్ఎస్.. 510 తో ముందంజ

    • మహబూబ్‌నగర్ నియోజకవర్గం తొలిరౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస గౌడ్‌కు 630 ఆధిక్యత

    • బోథ్ రెండవ రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ 1337 లీడ్.

    • అసిఫాబాద్ సెగ్మెంట్‌లో ఆసిఫాబాద్ నియోజకవర్గ మొదటి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కోవలక్ష్మి కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్ నాయక్ 779 ఓట్లు ఆధిక్యత సాధించారు.

    • పరిగి నియోజక వర్గం మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ

    • కోరుట్ల నియోజకవర్గంలో మొదటి రౌండ్ ఫలితాలు.... BRS - 3612, INC - 2098, BJP - 3444

    • ఆర్ముర్ బీజేపీ 1281 ఓట్ల ఆధిక్యం

    • మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో లీడ్‌లో బీజేపీ.. ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ ముందంజ...

    • ఆధిక్యంలో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్

    • మధ్యప్రదేశ్‌లో మెజారిటీ మార్కు దాటిన బీజేపీ... 123 స్థానాల్లో ముందంజ..

    • ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ముందంజ

    • నల్గొండ తొలిరౌండ్‌లో కోమటిరెడ్డి ఆధిక్యం... మెజార్టీ ఎంతంటే?..

    • భూపాలపల్లిలో లీడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి

    • ఖమ్మంలో మొదటి రౌండ్ పూర్తి.. లీడ్‌లో కాంగ్రెస్

  • 2023-12-03T09:38:20+05:30

    • మిర్యాలగూడలో మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డికి 2380 ఓట్ల ఆధిక్యం.

    • వికారాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి మెతుకు ముందంజ. మొదటి రౌండ్‌లో 605 ఓట్ల ఆధిక్యం.

    • వర్దన్నపేట 1400 కాంగ్రెస్ తోలి రౌండ్ లీడ్

    • మంచిర్యాల జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు... చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి 312 ఓట్లతో ముందంజ

    • పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు 2004 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

    • సూర్యాపేట సెగ్మెంట్‌లో మొదటి రౌండ్‌లో స్వల్ప ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి. బీఆర్ఎస్‌కు 4386, కాంగ్రెస్‌కు 4418, బీజేపీకి 1425 ఓట్లు పడ్డాయి.

    • దేవరకొండలో మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ లీడ్ : కాంగ్రెస్ : 5963, బీఆర్ఎస్ : 3836

    • పెద్దపెల్లి నియోజకవర్గంలో మొదటి రౌండ్ ఫలితాలు.. కాంగ్రెస్- 5126, బీఎస్‌పీ - 408, టీఆర్ఎస్ - 2716, బీజేపీ - 185

    • ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల రెండో రౌండ్‌లో ఆధిక్యం

    • హుస్నాబాద్: బీఆర్‌ఎస్ 4692, కాంగ్రెస్ 5492, ఆధిక్యం 800

    • మిర్యాలగూడలో రెండో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి బిఎల్ఆర్ 900 మెజారిటీ

    • ఆదిలాబాద్ రెండవ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి పాయల శంకర్ 366 ఓట్ల లీడ్.

    • భువనగిరిలో రెండో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి 957 లీడ్...

    • ఖమ్మంలో తుమ్మల రెండో రౌండకి 1752 ఆధిక్యత

  • 2023-12-03T09:25:15+05:30

    • కొడంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ముందంజ, మొదటి రౌండ్ లో 1365 ఓట్ల ఆధిక్యం, కాంగ్రెస్ కు 5503, బీ ఆర్ ఎస్ కు 4138

    • మొదటి, రెండు రౌండ్లు పూర్తయిన తర్వాత 3500ల లీడ్ లో కొనసాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క

    • మొదటి రౌండ్ లో.. కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2380 ఓట్ల ఆధిక్యం.

    • బీఆర్ ఎస్ అభ్యర్థి మెతుకు ముందంజ, మొదటి రౌండ్ లో 605 ఓట్ల ఆధిక్యం

    • వర్దన్నపేట 1400 కాంగ్రెస్ తోలి రౌండ్ లీడ్

    • పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు... చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి 312 ఓట్లతో ముందంజ.

    • పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు 2004 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

  • 2023-12-03T09:17:28+05:30

    • దేవరకద్ర కాంగ్రెస్ అభ్యర్థి జీ మధుసూదన్ రెడ్డి రెండొ రౌండ్లో 150 ఓట్ల ఆదిక్యం

    • నకిరేకల్ నియోజకవర్గంలో తొలి రౌండులో వేముల వీరేశం 2408 ఓట్ల ఆధిక్యం

    • తుంగతుర్తి లో 3600 ఓట్ల ఆధిక్యం లో కాంగ్రెస్ అభ్యర్ధి మందుల సామెల్

    • కోదాడలో 1500 ఓట్ల మెజార్టీతో ముందున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డి

    • జిల్లాలోని పెద్దపల్లి రామగుండం మంథని నియోజకవర్గాల్లో పూర్తికావస్తున్న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు .. ఆదిక్యతలో కాంగ్రెస్ ఆ పార్టీ అభ్యర్థులు.

    • నిజామాబాద్ రూరల్ లో కాంగ్రెస్ అభ్యర్థి 500 ఓట్లతో ఆధిక్యం

    • రంగారెడ్ది జిల్లా ఇబ్రహీంపట్నం మొదటి రౌండ్ లో 1383ఓట్ల తో కాంగ్రెస్ ముందంజ..

    • పాలేరు పొంగులేటి 2230 ఆధిక్యత

    • నాగార్జున సాగర్ తొలి రౌండ్ : కాంగ్రెస్ : 6051, బీఆర్ఎస్ : 3124, బీజేపీ; 330

    • నాగర్ కర్నూల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి 800 ఓట్ల ఆదిక్యం

    • వనపర్తి నియోజకవర్గంలో మొదటి రౌండ్‌లో బీఆర్ఎస్‌కు 739 లీడ్

    • భూపాలపల్లిలో 1,988 ఓట్లతో కాంగ్రెస్ లీడ్1

    • మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి blr 1595 ఆధిక్యం

  • 2023-12-03T09:13:29+05:30

    • ఖమ్మంలో మొదటి రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆధిక్యం

    • నర్సంపేటలో 679 తొలి రౌండ్ బీఆర్ఎస్ లీడ్

    • పరిగి నియోజకవర్గంలో మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి 812 ఓట్ల ఆధిక్యం

    • మక్తల్ నియోజకవరగంలో తొలిరౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి వాకాటి శ్రీహరి ముదిరాజ్ 1000 ఓట్ల ఆధిక్యత

    • సత్తుపల్లిలో బీఆర్‌ఎస్ 220 ఓట్లతో సండ్ర ఆధిక్యత

    • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థి కోణంనేని సాంబశివరావు అభ్యర్థి మెజారిటీ 2857

    • బోథ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ యాదవ్ 1210 లీడ్

    • తాండూరు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి ముందంజ

    • ఆలేరు నియోజకవర్గంలో మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి 760 లీడ్...

    • వైరాలో కాంగ్రెస్ మలోత్ రామదాసు ఆధిక్యత

    • మధిర భట్టి కాంగ్రెస్ 2098 ఆధిక్యత

    • కొత్తగూడెం సీపీఐ కూనంనేని 2856 ఓట్లు ఆధిక్యత

    • దేవరకద్ర నియోజకవర్గంలో తొలి రౌండ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర రెడ్డి 150 ఓట్ల ఆధిక్యం

    • తాండూరు నియోజకవర్గంలో మొదటి రౌండ్ లో బీఆర్ ఎస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి ముందంజ

    • సిద్దిపేటలో బిఅరెస్ అభ్యర్థి హరీష్ రావు తొలి రౌండ్ లో 6300 ఆధిక్యం

    • భువనగిరి నియోజకవర్గంలో రెండో రౌండ్ లోను కాంగ్రెస్ అభ్యర్థి కుంభ అనిల్ కుమార్ రెడ్డి ఆదిక్యం....

    • జెడ్చేర్ల నియోజకవరగంలో కాంగ్రెస్ అభ్యర్ధి అనిరుద్ రెడ్డి 408 ఓట్ల ఆధిక్యత

    • తాండూరు నియోజకవర్గంలో మొదటి రౌండ్ లో బీఆర్ ఎస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డికి 137 ఓట్ల ఆధిక్యం

  • 2023-12-03T09:06:45+05:30

    కామారెడ్డిలో సీఎం కేసీఆర్ వెనుకబడ్డారు

  • 2023-12-03T08:58:37+05:30

    • నాగార్జున సాగర్‌లో‌ మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్ రెడ్డి రెడ్డి 3 వేల ఓట్ల ఆధిక్యం

    • హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి 2000 ఓట్ల అధిక్యం

    • ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజ

    • బాల్కొండ కాంగ్రెస్ ముందంజ పోస్టల్ బ్యాలెట్

    • నల్గొండ నియోజకవర్గంలో మొదటి రౌండ్ పూర్తి. 4000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

    • ఆలేరు నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య 300 లీడ్....

  • 2023-12-03T08:49:48+05:30

    • కోడంగల్ లో రేవంత్ ముందంజ

    • బాల్కొండ , ఆర్మూర్ , నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ లీడ్

    • బోధన్ కాంగ్రెస్ లీడ్

    • నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ లీడ్

    • వికారాబాద్ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజ

    • భువనగిరి నియోజకవర్గం లో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి 400 లీడ్....

    • నల్గొండ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందంజ

  • 2023-12-03T08:36:47+05:30

    కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ముందంజ

    Untitled-4.jpg

  • 2023-12-03T08:34:47+05:30

    • నల్గొండలో కాంగ్రెస్ ముందంజ

    • మధిర పోస్టల్ బ్యాలెట్‌లో భట్టి ముందంజ

    • కరీంనగర్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బీజేపీ ముందంజ

    • చాంద్రాయణగుట్లో అక్బరుద్దీన్ ఓవైసీ ముందంజ

    • ఇబ్రహీంపట్నంలో ఇంకా మొదలుకానీ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు

    • పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ఆధిక్యం

    • నల్గొండ పోస్టల్ బ్యాలెట్‌లో కోమటిరెడ్డి ముందంజ

    • ఖమ్మం పోస్టల్ బ్యాలెట్‌లో తుమ్మల ముందంజ

    • పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందంజ.

    • అశ్వారావుపేట, పినపాక, భధ్రాచలంలో కాంగ్రెస్ ముందంజ

  • 2023-12-03T08:30:20+05:30

    రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రక్రియ. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌కు ఆధిక్యం కనిపించింది. ఇక అసలైన ఓట్ల లెక్కింపులో ఎవరు ముందంజలో మరికాసేపట్లో స్పష్టం కానుంది.

  • 2023-12-03T08:26:23+05:30

    • ఇబ్రహింపట్నంలో ఇంకా మొదలుకాని పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్

    • నల్గొండలో కాంగ్రెస్ ముందంజ

    • మధిర పోస్టల్ బ్యాలెట్‌లో భట్టి ముందంజ

  • 2023-12-03T08:23:40+05:30

    పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ దూసుకుపోతోంది.. ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో కనిపిస్తున్నారు.

  • 2023-12-03T08:09:24+05:30

    పోస్టల్ ఓట్ల లెక్కింపులో బండి సంజయ్ ముందంజ

  • 2023-12-03T08:00:23+05:30

    పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ ఆధిక్యం.

    25 చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ 16, బీజేపీ 1 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నాయి.

  • 2023-12-03T07:56:42+05:30

    మహబూబ్‌నగర్ జిల్లా 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోస్టల్ ఓట్ల వివరాలు

    మహబూబ్ నగర్ - 3923

    జడ్చర్ల -1111

    దేవరకద్ర - 970

    నారాయణపేట - 1247

    మక్తల్ - 958

    కొడంగల్ - 1165

    నాగర్ కర్నూల్ - 1154

    కొల్లాపూర్ - 789

    అచ్చంపేట - 3400

    గద్వాల్ - 1651

    ఆలంపూర్ - 1399

  • 2023-12-03T07:25:32+05:30

    మరి కొద్ది సేపట్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం

  • 2023-12-03T07:15:35+05:30

    కామారెడ్డి ఫలితం కొంత ఆలస్యమయ్యే అవకాశం.. 39 మంది బరిలో ఉండడంతో మూడు ఈవీఎంల వినియోగం.. కౌంటింగ్ సమయంలో మూడేసి ఈవీఎంలను లెక్కించే సందర్భంలో ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.

  • 2023-12-03T07:10:33+05:30

    కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధింపు.. ఐదంచెల భద్రత.. కిలోమీటరు దూరంలోనే ఆంక్షలు అమలు

  • 2023-12-03T07:00:27+05:30

    తెలంగాణ ఎన్నికల తొలి ఫలితం భద్రాచలం, చార్మినార్‌ల నుంచి రానుంది

  • 2023-12-03T06:55:39+05:30

    యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ‘బిగ్ డే’ వచ్చేసింది. సార్వత్రిక ఎన్నికలు -2024కి సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నమైంది. ఈవీఎం మెషిన్లలో నిక్షిప్తమైన ఓటరు తీర్పు బయటకు రాబోతోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజానీకం ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్న ‘తెలంగాణ తీర్పు’ మరికొద్ది గంటల్లోనే తెలిసిపోనుంది. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యి కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుందా?. అనూహ్యంగా బీఆర్ఎస్ మేజిక్ ఫిగర్ సాధిస్తుందా? అన్నది మరికొద్ది గంటల్లోనే వెల్లడికానుంది. తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది సేపట్లో మొదలుకాబోతోంది.

    ఎన్నెన్నో ప్రశ్నలు.. ప్రతి ఒక్కరి మదిలో ఎంతో ఉత్కంఠ! అన్నిటికీ సమాధానం మరికొద్ది సేపట్లో! మరికొద్ది గంటల్లోనే ఫలితాలు వెలువడనున్నాయి! క్రమక్రమంగా ఉత్కంఠకూ తెరపడనుంది!! అయితే.. ‘‘మనం 69 స్థానాల్లో గెలుస్తున్నాం! మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుంది’’ అంటూ పార్టీ కార్యకర్తల ఎదుట కేసీఆర్‌ భరోసా వ్యక్తం చేస్తే.. ఎన్నికైన ఎమ్మెల్యేలను ఎక్కడ కేసీఆర్‌ కొనేస్తారోననే భయంతో ప్రతి వ్యూహాన్ని కాంగ్రెస్‌ సిద్ధం చేసుకుంది! అభ్యర్థులను మధ్యాహ్నానికల్లా హైదరాబాద్‌కు తీసుకొచ్చి క్యాంపులకు తరలించే సన్నాహాలు చేస్తోంది! హంగ్‌ వస్తే ట్రబుల్‌ షూటింగ్‌కు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను రంగంలోకి దించింది!! తెలంగాణ ప్రజలు మార్పునకే ఓటేశారా!? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని ఎట్టకేలకు ఈసారి ఆదరించారా!? కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం రానుందా!? కేసీఆర్‌ చరిత్ర సృష్టిస్తారా!? హ్యాట్రిక్‌ సాధించిన తొలి దక్షిణాది సీఎంగా నిలుస్తారా!? వరుసగా మూడోసారీ బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందా!? బీజేపీ ఈసారి డిపాజిట్లను దాటి ముందుకు వెళుతుందా!? ఫలితాల్లో ఆ పార్టీకి సింగిల్‌ డిజిట్టేనా!? లేక, డబుల్‌ డిజిట్‌కు చేరే అవకాశాలూ ఉన్నాయా!?.