Share News

Hyderabad: ఓటర్లకు బంపరాఫర్! సిరా మార్క్‌ చూపిస్తే..!

ABN , First Publish Date - 2023-11-23T11:32:44+05:30 IST

ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు నగర ఓటర్లకు పలు సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ‘ఓటు వేయండి.. ఆఫర్‌ పట్టండి..’ అంటూ

Hyderabad: ఓటర్లకు బంపరాఫర్! సిరా మార్క్‌ చూపిస్తే..!

  • వేలిపై సిరా చూపితే 15 శాతం రాయితీ

  • ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఆఫర్లు..

  • సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు ఫుడ్‌ కూపన్‌లు

ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు నగర ఓటర్లకు పలు సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ‘ఓటు వేయండి.. ఆఫర్‌ పట్టండి..’ అంటూ వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 22(ఆంధ్రజ్యోతి): మీరు ఓటు వేసినట్లుగా సిరా మార్క్‌ చూపించండి.. ప్రవేశ ధరలో 15శాతం రాయితీ పొందండి అని వండర్‌లా హైదరాబాద్‌ పార్క్‌ ఆఫర్లకు తెరతీసింది. ఇదే రీతిలో గతంలో సాధారణ ఎన్నికల వేళ ఆఫర్లను ప్రకటించిన కంపెనీలు కూడా తమవైన ప్రయత్నాలను చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి.

  • నగరంలో అత్యల్ప ఓటింగ్‌ శాతానికి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఒక కారణమనే భావన పొగొట్టడానికి ఈసారి తాము ప్రత్యేకంగా ఫ్రీ బీ లను అందించడానికి ప్రణాళిక చేస్తున్నామని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థకు ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సేవలను అందిస్తున్న శ్రీనివాస్‌ తెలిపారు. సోడెక్సో పాస్‌ లాంటివి వాటిలో ఉంటాయంటూ, స్పష్టమైన ప్రణాళికను రెండు మూడు రోజుల్లో తీసుకురానున్నామన్నారు. తమ అసోసియేషన్‌ సభ్యులు కూడా వినూత్న ఆఫర్లతో రావాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

  • ఓటు వేయండి... ఆఫర్‌ అందుకోండి అనేందుకు పలు క్యూఎస్‌ఆర్‌లు కూడా సిద్ధంగా ఉన్నాయని, అయితే, తొలిసారి ఓటర్లకు ఈ ఆఫర్‌ను పరిమితం చేయనున్నట్లు ఓ సంస్థ ప్రతినిధి వెల్లడించారు.

Updated Date - 2023-11-23T12:08:02+05:30 IST