Share News

Skylab Naik: బీఆర్ఎస్కు భారీ షాక్ .. ఆ కీలక నేత రాజీనామా

ABN , First Publish Date - 2023-11-15T21:53:47+05:30 IST

మిర్యాలగూడలో బీఆర్ఎస్ ( BRS ) కు భారీ షాక్ తగిలింది. ఈనెల 17వ తేదీన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) సమక్షంలో స్కైలాబ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) లో చేరనున్నారు.

Skylab Naik: బీఆర్ఎస్కు  భారీ షాక్ .. ఆ కీలక నేత రాజీనామా

నల్గొండ : మిర్యాలగూడలో బీఆర్ఎస్ ( BRS ) కు భారీ షాక్ తగిలింది. ఈనెల 17వ తేదీన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) సమక్షంలో స్కైలాబ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) లో చేరనున్నారు. కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి స్కైలాబ్ నాయక్ ( Skylab Naik ) దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి స్కైలాబ్ నాయక్ టికెట్ ఆశించి భంగపడ్డారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్కైలాబ్ నాయక్ మూడో స్థానంలో నిలిచారు. స్కైలాబ్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరితే మిర్యాలగూడలో బలం పేరిగే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. దీనికి తోడు తన సామాజిక వర్గ ఓట్లు కూడా అధికంగా ఉండడంతో మిర్యాలగూడలో ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని అనుకుంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కొంతమేర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-11-15T21:53:48+05:30 IST