Share News

Revanth Reddy: కేసీఆర్ మోడల్ అంటే బ్యారేజ్‌లు కుంగిపోవడమా?

ABN , First Publish Date - 2023-11-20T15:38:59+05:30 IST

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం. కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ కాదు.. ఎకరాకు రూ.15 వేలు ఇస్తాం. కౌలు రైతులకు, భూమి లేని నిరుపేదలకు

Revanth Reddy: కేసీఆర్ మోడల్ అంటే బ్యారేజ్‌లు కుంగిపోవడమా?

మెదక్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (Cm kcr) రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీనేనని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. నర్సాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ పాల్గొని కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దగ్గరలోనో.. బిర్లా మందిర్ దగ్గరో కేసీఆర్ కుటుంబం బిచ్చ మెత్తుకునే వారని విమర్శించారు. కేసీఆర్ మోడల్ అంటే కుంగిపోయే బ్యారేజ్‌లా అంటూ ప్రశ్నించారు. పదేళ్లు ఏం చేశారో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను తిడితే ఉసురు తగులుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అరాచక రాజ్యమేలుతోందని.. కేసీఆర్‌ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్‌ను ఎన్నికల్లో వంద కిలో మీటర్ల లోపల పాతిపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం. కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ కాదు.. ఎకరాకు రూ.15 వేలు ఇస్తాం. కౌలు రైతులకు, భూమి లేని నిరుపేదలకు కూడా రూ.15 వేలు ఇస్తాం. 50 ఏళ్లు స్నేహం చేసిన మదన్‌రెడ్డిని మోసం చేసి టికెట్ వేరొకరికి ఇచ్చిన కేసీఆర్‌కు ప్రజలు ఓ లెక్కా. బీఆర్‌ఎస్ పాలనలో బంగారు తెలంగాణ కాలేదు. బొందల గడ్డ తెలంగాణగా మార్చారు. బెల్ట్ షాపుల్లో తెలంగాణను మొదటి స్థానంలో నిలిపారు. పార్టీ మారిన నేతలను అసెంబ్లీ గేట్ దాటనివ్వొద్దు. దళితులకు భూములు పంపిణి చేసిన పార్టీ కాంగ్రెస్. నాగార్జున సాగర్ సహా పలు ప్రాజెక్టులు కట్టి రాష్ట్రంలో 70 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ సాగు నీరు ఇచ్చింది. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ల కోసం చట్టం చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే.’’ నని రేవంత్ వెల్లడించారు.

Updated Date - 2023-11-20T15:42:02+05:30 IST