Jagdish Reddy: కాంగ్రెస్ పార్టీది రక్త చరిత్ర
ABN , First Publish Date - 2023-11-17T20:38:09+05:30 IST
కాంగ్రెస్ పార్టీది రక్త చరిత్ర అని మంత్రి జగదీష్‌రెడ్డి ( Minister Jagdish Reddy ) తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం నాడు సూర్యాపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సూర్యాపేట : కాంగ్రెస్ పార్టీది రక్త చరిత్ర అని మంత్రి జగదీష్‌రెడ్డి ( Minister Jagdish Reddy ) తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం నాడు సూర్యాపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ...‘‘ కాంగ్రెస్ పార్టీది 42 పేజీల మేనిఫెస్టో కాదు.., 420 మేనిఫెస్టో. తెలంగాణ అమరుల త్యాగాలను, పోరాటాన్ని తక్కువ చేసిన పార్టీని వంద అడుగుల గుంత తీసి బొంద పెట్టాలి. ఉత్తమ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి లాంటి వృద్ధ నాయకులను ప్రజలు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడించబోతున్నారు. రేవంత్‌రెడ్డి నోటితో రైతులకు 3 గంటల విద్యుత్ చాలు అంటాడు. మేనిఫెస్టోలో 24 గంటలు అంటారు ఎలా నమ్మాలి’’ అని మంత్రి జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు.