Share News

Gangula Kamalakar: కిరణ్‌కుమార్‌రెడ్డి సమయంలో ఆ విషయంపై వెకిలిగా నవ్వాడు

ABN , First Publish Date - 2023-10-29T18:25:48+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ( Kiran Kumar Reddy ) హయాంలో మున్నూరుకాపు సంఘ భవనానికి 10 గుంటల భూమి ఇవ్వమని అడిగితే ఆయన వెకిలిగా నవ్వాడని మంత్రి గంగుల కమలాకర్ ( Minister Gangula Kamalakar ) అన్నారు.

Gangula Kamalakar: కిరణ్‌కుమార్‌రెడ్డి సమయంలో ఆ విషయంపై వెకిలిగా నవ్వాడు

మెదక్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ( Kiran Kumar Reddy ) హయాంలో మున్నూరుకాపు సంఘ భవనానికి 10 గుంటల భూమి ఇవ్వమని అడిగితే ఆయన వెకిలిగా నవ్వాడని మంత్రి గంగుల కమలాకర్ ( Minister Gangula Kamalakar ) అన్నారు. ఆదివారం నాడు మెదక్‌లో మున్నూరుకాపు కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభకు మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడుతూ...‘‘ మరోసారి కిరణ్ కుమార్‌రెడ్డి దరఖాస్తు అందజేసి దండం పెట్టి 10 గుంటల భూమి ఇవ్వమని అడిగితే.. చుట్టూ స్మశానాలు, బొందలు ఉన్న చోట్ల భూమి ఇచ్చారు. కాని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కోకాపేటలో నడి ఒడ్డున పది ఎకరాల భూమి మున్నురు కాపులకు ఇచ్చాడు.. కోకాపేటలో ఇచ్చిన భూమి విలువ 500 కోట్లు. ముఖ్యమంత్రి కేసీఆర్ మున్నూరుకాపు కులానికి గౌరవం ఇచ్చాడు ఆయనకు మనం రుణపడి ఉండాలి. తెలంగాణ రాష్ట రాకముందు మన కులానికి ప్రాధాన్యత లేదు. ఈ ఎన్నికల్లో తప్పు చేస్తే భవిష్యత్తు అంధకారం అవుతుంది. మున్నూరు కాపు కార్పొరేషన్ తీసుకురావడానికి కృషి చేస్తాం. నేను , మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఒకే స్కూల్‌లో చదువుకున్నాం. మోసం చేసే గుణం ఉన్న వ్యక్తులం కాదు. మనమంటే అన్ని పార్టీలకు ఇష్టం’’ అని గంగుల కమలాకర్ తెలిపారు.

Updated Date - 2023-10-29T18:25:48+05:30 IST